Breaking News

వాట్సాప్‌ స్టేటస్‌గా ‘మధ్యాహ్నం హత్య’!

Published on Mon, 12/01/2025 - 05:52

సాక్షి, క్రైమ్‌: ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా, కోపోద్రిక్తుడైన బాలమురుగన్‌.. వెంట తెచ్చుకున్న కొడవలి తీసి శ్రీప్రియపై దాడి చేశాడు. మెడపై బలంగా గాయమవడంతో శ్రీప్రియ అక్కడికక్కడే మరణించింది. అనంతరం భార్య మృతదేహం పక్కన బాలమురుగన్‌ ఓ కుర్చీ వేసుకుని కూర్చుని సెల్ఫీ తీసుకున్నాడు. 

భార్యను కొడవలితో నరికి భర్త హత్య చేసిన దారుణ ఘటన ఆదివారం తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగింది. నెల్లై జిల్లా మేలపాళయం సమీపంలోని తరువాయికి చెందిన బాలమురుగన్, శ్రీప్రియ(32) దంపతులు. వీరికి  ముగ్గురు పిల్లలు ఉన్నారు. 

కుటుంబ కలహాల కారణంగా శ్రీప్రియ తన భర్త, పిల్లలను వదిలి కోయంబత్తూరుకు వచ్చి రేస్‌కోర్సు సమీపంలోని 5వ వీధిలో ఉన్న మహిళల హాస్టల్‌లో ఉంటూ టౌన్‌ హాల్‌ ప్రాంతంలోని ఓ బట్టల దుకాణంలో పనిచేస్తోంది. ఆదివారం శ్రీప్రియను కలవడానికి ఆమె భర్త బాలమురుగన్‌ వచ్చాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా, కోపోద్రిక్తుడైన బాలమురుగన్‌.. వెంట తెచ్చుకున్న కొడవలి తీసి శ్రీప్రియపై దాడి చేశాడు. 

మెడపై బలంగా గాయమవడంతో శ్రీప్రియ అక్కడికక్కడే మరణించింది. అనంతరం భార్య మృతదేహం పక్కన బాలమురుగన్‌ ఓ కుర్చీ వేసుకుని కూర్చుని సెల్ఫీ తీసుకున్నాడు. ఆ ఫొటోను తన వాట్సాప్‌ స్టేటస్‌లో పోస్ట్‌ చేశాడు. అందులో ‘ద్రోహానికి ఫలితం.. మరణం’ అని క్యాప్షన్‌ ఇచ్చాడు. 

శ్రీప్రియ తన నుంచి విడిపోయాక ఓ యువకుడితో కలిసి దిగిన ఫొటోను ఇటీవల చూశానని, అందుకే కోపంతో హత్య చేశాడని బాలమురుగన్‌ పోలీసుల విచారణలో తెలిపాడు. ఈ హత్య ఆదివారం తమిళనాట పెను సంచలనం సృష్టించింది.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)