Breaking News

తుపాను ప్రభావం.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Published on Sat, 10/09/2021 - 18:58

న్యూఢిల్లీ: హైదరాబాదులో కురుస్తున్న భారీ వర్షం నగర ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు అక్కడక్కడా పిడుగులు కూడా పడ్డాయి. ఈ నేపథ్యంలో భారత వాతావారణ శాఖ(ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. మరొకొన్ని రోజుల పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేసింది. 

తూర్పు మధ్య అరేబియా సముద్రంపై తుపాను ప్రసరణ ఉందని తెలిపింది ఐఎండీ. ఈ ప్రభావం రాబోయే 4-5 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని.. ఇది క్రమంగా బలహీనపడి ఉత్తరం వైపు కదులుతూ ఉంటుందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావం వల్ల దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలపింది. 
(చదవండి: కోస్తాంధ్రకు మరో తుపాను!)

గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, కర్ణాటక తీర ప్రాంతం, ఆంధ్రప్రదేశ్‌ తీరం ప్రాంతం, తమిళనాడు, పాండిచరి రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇక గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌, పాండిచేరి, తమిళనాడు రాష్ట్రాల్లో అక్టోబర్‌10-12 మధ్య వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. 

చదవండి: మీ స్మార్ట్‌ఫోన్‌తో తుపాన్లను ఎలా ట్రాక్‌ చేయాలో తెలుసా...!

           

Videos

స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం క్లీన్ స్వీప్ చేశాం

Covid-19 New Variant: తొందరగా సోకుతుంది..

మీరు కూడా పుస్తకాలు తీసి పేర్లు రెడీ చేయేండి..

YSRCP హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు: YS Jagan

పెళ్ళైన రెండో రోజే మృత్యుఒడికి నవవరుడు

LIVE: మనకూ టైం వస్తుంది.. వాళ్లకు సినిమా చూపిస్తాం

MISS INDIA: తిరుమల శ్రీవారి సేవలో మానస వారణాసి

బెంగళూరులో రోడ్లు, కాలనీలు జలమయం

రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లతో సమావేశం

హీరోయిన్ సాయి ధన్సిక తో విశాల్ వివాహం

Photos

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)

+5

'వార్‌ 2' మొదలైంది.. టీజర్‌లో ఈ షాట్స్‌ గమనించారా? (ఫోటోలు)

+5

ఐదో రోజు సరస్వతీ నది పుష్కరాలు..భక్తజన సంద్రం (ఫోటోలు)

+5

విశాల్‌తో పెళ్లి.. నటి ధన్సిక ఎవరో తెలుసా (ఫోటోలు)

+5

ముంచెత్తిన కుండపోత.. నీట మునిగిన బెంగళూరు (ఫొటోలు)

+5

జూ.ఎన్టీఆర్ బర్త్ డే.. ఈ విషయాలు తెలుసా? (ఫొటోలు)

+5

పెళ్లయి మూడేళ్లు.. నిక్కీ-ఆది హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)