Breaking News

‘ఫున్సుఖ్ వాంగ్డూ’ చనిపోవడం ఇష్టం లేదు : 3 ఇడియట్స్‌ నటుడి భావోద్వేగం

Published on Tue, 07/14/2026 - 13:23

నీట్ (NEET) పరీక్ష లీక్‌, ఇతర  పరీక్షల నిర్వహణలో అక్రమాలకు వ్యతిరేకంగా  ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలు  25వ రోజుకు చేరుకున్నాయి. ఈ  ఉద్యమానికి  మద్దతుగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష  చేపట్టిన  ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ పరిరక్షకుడు సోనమ్ వాంగ్‌‌‌‌చుక్ ఆరోగ్యం  క్రమంగా క్షీణిస్తోంది. దీనిపై '3 ఇడియట్స్' సినిమాలో 'చతుర్' పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్‌ నటుడు ఓమి వైద్య తీవ్ర భావోద్వేగంతో స్పందించారు.

ఓమి వైద్య భావోద్వేగ విజ్ఞప్తి
‘ఫున్సుఖ్ వాంగ్దూ’( వాంగ్‌ చుక్‌) చనిపోవడం నాకు ఇష్టం లేదు అంటూ  సోనమ్ వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్షపై ఎవరూ స్పందించడం లేదంటూ సోషల్‌మీడియాలో ఒక వీడియోను పోస్ట్‌ చేశారు. సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు తన మద్దతును ప్రకటించిన ఓమి బాలీవుడ్ ఐకానిక్ సినిమాతో ఉన్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ మూవీలో  ఆమీర్ ఖాన్ పోషించిన 'ఫున్సుఖ్ వాంగ్డూ' పాత్ర నిజ జీవితంలో సోనమ్ వాంగ్‌చుక్ స్ఫూర్తితో రూపొందించిందేనని  సినీ ప్రేమికులకు గుర్తు చేశారు.

సోషల్ మీడియాలో పంచుకున్న ఒక భావోద్వేగ వీడియోలో ఓమి వైద్య మాట్లాడుతూ, "నాకు ఫున్సుఖ్ వాంగ్దూ చనిపోవడం ఇష్టం లేదు" అంటూ ఆవేదనవ్యక్తం చేశారు. గతంలో తాను వాంగ్‌చుక్‌ను కలిశానని, ఇంజనీర్‌గా, ఆవిష్కర్తగా, విద్యా సంస్కర్తగా ఆయన చేసిన కృషి ఎంతో అద్భుత మైందని కొనియాడారు.

ప్రస్తుతం వాంగ్‌చుక్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆయన చాలా రోజులుగా నిరాహార దీక్షలో ఉన్నారు, దీంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ క్షీణిస్తుండటం చాలా ఆందోళనకరమైన విషయమని పేర్కొన్నారు. రాజకీయ అభిప్రాయాలకు అతీతంగా ప్రజలు దీనిని చూడాలన్నారు. ఆయనతో ఏకీభవించినా, ఏకీభవించకపోయినా, ఒక మేధావి చనిపోవడం తనకు అస్సలు ఇష్టం లేదని వైద్య పేర్కొన్నారు. వాంగ్‌చుక్ చేసిన పనుల గురించి చదివి, ఆయన సందేశాన్ని అందరికీ షేర్ చేస్తూ అవగాహన పెంచాలని ఆయన ప్రజలను కోరారు.

ఇదీ  చదవండి: రూ. 2 కోట్ల బంగారం పేస్ట్‌ : తమిళనాడు జంట అరెస్ట్‌

క్షీణిస్తున్న వాంగ్‌చుక్‌ ఆరోగ్యం
వాంగ్‌చుక్ దీక్ష 17వ రోజుకు చేరుకోవడంతో, ఆయన కండరాల క్షీణతను ఎదుర్కొంటున్నారని, తీవ్రమైన నొప్పితో బాధ పడుతున్నారని CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తెలిపారు. తాజా హెల్త్ అప్‌డేట్స్ ప్రకారం, వాంగ్‌చుక్ 8 కేజీలకు పైగా బరువు తగ్గారు. బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోతూ ఉంది. దీంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పలువురు విజ్ఞప్తి చేసినప్పటికీ ఆయన దీక్షను విరమించడానికి నిరాకరించారు "నా దీక్షను విరమించమని నన్ను అడగకండి. కనీసం చర్చలు జరపడానికి కూడా ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదో వారిని అడగండి" అని వాంగ్‌చుక్ అన్నట్లు దిప్కే పేర్కొన్నారు.

ఆమీర్‌పై  విమర్శలు
మరోవైపు బాలీవుడ్‌లో 3 ఇడియట్స్‌​ మూవీ ద్వారా  కోట్లు రూపాయలు దండుకున్న ఆమీర్‌ ఖాన్‌ మూడో పెళ్లి సంబరాల్లో మునిగి  తేలుతూ, రియల్‌  ‘ఫున్సుఖ్ వాంగ్దూ’  గురించి పట్టించుకోవడం లేదంటూ  తీవ్ర విమర్శలు వెల్లువెతుతున్నాయి.

కాగా 59 ఏళ్ల సోనమ్ వాంగ్‌చుక్ జూన్ 28న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన నిరసనలో చేరారు. అప్పటి నుండి ఆయన నిరవధిక నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. ఈ నిరవధిక దీక్షలో ఉన్న వాంగ్‌చుక్‌ను  నటులు ప్రకాష్ రాజ్, నసీరుద్దీన్ షా, రత్నా పాఠక్ షా, రచయిత్రి అరుంధతీ రాయ్, ఆర్థికవేత్త జయతి ఘోష్, టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా కూడా ఆయన  పోరాటానికి మద్దతు పలికారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)