Breaking News

‘నిధుల్లేవ్‌.. నేనేమి మంత్రినీ కాను’.. వరద సాయంపై ఎంపీ కంగనా

Published on Mon, 07/07/2025 - 08:17

నా దగ్గర నిధులు లేవు, నేనేం కేంద్రంలో మంత్రినీ కాను.. అయినా సరే కేంద్రం నుంచి వరద బాధిత ప్రాంతాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నాను’ అంటూ ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌.. తన మండీ నియోజకవర్గంలో వ్యాఖ్యలు చేశారు.

హిమాచల్ ప్రదేశ్‌లో కుంభవృష్టి కారణంగా  వరదలు సంభవించి 14 మంది మృతిచెందారు. మరో 31 మంది గల్లంతయ్యారు. ఈ నేపధ్యంలో మండీ ఎంపీ కంగనా రనౌత్  ఆ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు క్యాబినెట్ పదవి లేదని, విపత్తు సహాయానికి తన దగ్గర నిధులు లేవని, అయినా కేంద్రం నుండి ఆర్థిక సహాయం  అందించేందుకు తాను అన్ని ప్రయత్నాలు చేస్తున్నానని అన్నారు. 

ఇంతటి వరదలకు బాధ్యులైనవారు తమ ముఖాలను దాచుకుంటున్నారని, వారు అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్‌పై కంగనా విమర్శలు గుప్పించారు. విధాన రూపకల్పనలో తనకు సామర్థ్యం ఉందని, అయితే రాష్ట్ర స్థాయిలో లేదా పంచాయతీ స్థాయిలో  అది చాలా తక్కువని కంగనా పేర్కొన్నారు.
 

హిమాచల్ ప్రదేశ్‌కు రక్షణ దళాలను పంపడం ద్వారా కేంద్రం తక్షణ సహాయ కార్యకలాపాలను ప్రారంభించిందన్నారు. ఐదు దేశాల పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి ఇక్కడి పరిస్థితి గురించి తెలుసునని ఎంపీ పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు తాము సహాయ సామగ్రిని అందించామని, ఒక ఎంపీగా నిధులు తీసుకురావడం, ప్రభుత్వానికి గ్రౌండ్ రియాలిటీని తెలియజేయడం తన పని అని ఆమె స్పష్టం చేశారు. 

హిమాచల్ ప్రదేశ్‌లో రాబోయే 20 ఏళ్లలో కాంగ్రెస్ అధికారంలోకి రాదని రనౌత్ వ్యాఖ్యానించారు. కాగా కంగనా.. విపత్తుల సమయంలో మండీ ప్రజలకు అందుబాటులో లేరంటూ కాంగ్రెస్‌‌ తీవ్ర విమర్శలు గుప్పించిన అనంతరం ఆమె ఈ ప్రాంతంలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే.. ఒక ఎంపీగా ఆమె ఇటువంటి  మాటలు మాట్లాడటం ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. స్థానికంగా సాయం అందించేందుకు ఒక ఎంపీకి అవకాశమే ఉండదా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.


ఇది కూడా చదవండి: భారత్‌-పాక్‌లను ఒకేలా తూచలేం: ‘బ్రిక్స్‌’లో ప్రధాని మోదీ

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)