Breaking News

భర్త ఘాతుకం.. 6 నెలల క్రితమే ప్రేమ పెళ్లి.. హెల్మెట్‌ ధరించి మరీ

Published on Sun, 02/05/2023 - 12:55

చెన్నై: తమిళనాడులోని మధురైలో పట్టపగలు నడురోడ్డుపై యువతి హత్యకు గురైంది. ప్రేమ వివాహం చేసుకున్న భర్తే హెల్మెట్‌ ధరించి ఈ హత్యకు పాల్పడినట్లు తేలింది. నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. వివరాలు.. మధురైలోని సౌత్‌గేట్‌ సప్పాని కోవిల్‌ వీధికి చెందిన మీనాక్షి సుందరం చిన్న కుమార్తె వర్ష (19) కీరైత్తురైకు చెందిన పళని(25)ని ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది.

కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి.  నెలన్నర క్రితం వర్ష పుట్టింటికి వచ్చింది. పళని రావాలని కోరినా నిరాకరించింది. శుక్రవారం మధ్యాహ్నం వర్ష సప్పాని కోవిల్‌ వీధిలో ఓ దుకాణానికి వెళ్లి ఇంటికి వెళుతోంది. హెల్మెట్‌ ధరించి బైక్‌పై వచ్చిన పళని ఆమెతో మాట్లాడేందుకు యతి్నంచాడు. ఆమె వినకపోవడంతో వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. అనంతరం బైక్‌పై పరారయ్యాడు.

వర్షను చికిత్స నిమిత్తం మధురై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సౌత్‌ గేట్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా పళనిగా గుర్తించారు. ఈ క్రమంలో పళని కీరైత్తురై పోలీసుస్టేషన్‌లో లొంగిపోయాడు.
చదవండి: అమ్మా, పెళ్లికి వెళ్లొస్తాం.. శుభకార్యం కోసం వెళ్లి మృత్యుఒడిలోకి!

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)