Breaking News

జిమ్ ట్రైన‌ర్‌తో ప్రేమ.. భ‌ర్త అడ్డుగా ఉన్నాడ‌ని.. మూడేళ్ల త‌ర్వాత‌!

Published on Wed, 06/19/2024 - 19:17

చండీగఢ్‌:  ప్రియుడి మోజులో ప‌డి ఓ మ‌హిళ క‌ట్టుకున్న భ‌ర్త‌ను క‌డ‌తేర్చేందుకు సిద్ద‌మైంది. ఒక‌టి కాదు రెండు ప్లాన్‌లు వేసి అత‌డిని వ‌దిలించుకోవాల‌నుకుంది. మొద‌టి ప్రయ‌త్నంలో అత‌డు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ‌గా.. రెండో సారి ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం హ‌త్య జ‌రిపించింది. చివరికి అనుమానాస్పద ప్రవర్తనే ఆమె నేరాన్ని పోలీసులకు పట్టించింది. ఈ కేసుపై దర్యాప్తు చేసిన పోలీసులు మూడేళ్ల తర్వాత ఆ మహిళను అరెస్ట్‌ చేశారు.  హర్యానాలోని పానిపట్‌లో ఈ సంఘటన వెలుగుచూసింది.

వివ‌రాలు.. కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన వినోద్ బరారాకు నిధితో వివాహమైంది. ఆ దంపతులకు ఒక కుమార్తె ఉంది. వీరు పానిపట్‌లో నివాసం ఉంటున్నారు. నిధికి కొన్నేళ్ల క్రితం సుమిత్‌ అనే జిమ్‌ ట్రెయినర్‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అనంత‌రం ఇది ప్రేమ‌గా మారింది. ఈ విషయం వినోద్‌కు తెలియ‌డంతో  దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో వినోద్‌ను ఎలాగైనా అడ్డుతొలగించుకొని సుమిత్‌తో జీవించాలని నిధి నిర్ణయించుకొంది.

పంజాబ్‌కు చెందిన దేవ్‌ సునార్‌ అనే లారీ డ్రైవర్‌కు రూ. 10 లక్షలు సుపారీ ఇచ్చి.. తన భర్తను వాహనంతో ఢీకొట్టి చంపాలని సూచించింది. 2021 అక్టోబర్‌ 5న వినోద్‌ను ఇంటి సమీపంలోనే దేవ్‌ లారీతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కానీ, ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు. 

నిందితుడైన లారీ డ్రైవర్‌ దేవ్‌ సునర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేసును వెనక్కి తీసుకోవాలని వినోద్‌ను సునర్‌ బెదిరించాడు. కానీ అత‌డు నిరాక‌రించాడు. దీంతో భర్తను ఎలాగైన సరే అడ్డు తొలగించుకోవాలన్న మ‌హిళ మ‌రో ప్లాన్ వేసింది. అదే ఏడాది డిసెంబ‌ర్ 15న  దేవ్‌.. నిధి ఇంటికి వెళ్లి మంచానపడి ఉన్న వినోద్‌ను పాయింట్‌ బ్లాంక్‌ రేంజిలో కాల్చి చంపాడు. పోలీసులు దేవ్‌ను హంతకుడిగా గుర్తించి అరెస్టు చేశారు.  కోర్టులో కేసు వెనక్కి తీసుకోనందుకే వినోద్‌ను చంపినట్లు పోలీసులకు చెప్పాడు.

ఈ ఘటన తర్వాత దేవ్‌ కుటుంబ అవసరాలను నిధి, జిమ్‌ ట్రైనర్‌ సుమిత్‌లే చూసుకొంటున్నారు.  వినోద్‌ హత్య తర్వాత నిధి సైతం విలాసవంతంగా జీవించింది. కుమార్తెను ఆస్ట్రేలియాలోని బంధువు వద్దకు పంపింది. ఆమె విలాసవంతమైన జీవనశైలి వినోద్‌ కుటుంబీకుల్లో అనుమానాలను పెంచింది. దీంతో అతడి సోదరుడు ప్రమోద్‌ మూడేళ్ల తర్వాత పానిపట్  ఎస్పీ అజీత్‌ సింగ్‌కు విషయం చెప్పాడు.

తన సోదరుడి భార్యపై అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసుల ప్రత్యేక బృందం నిందితుడు దేవ్‌ కాల్‌ డేటాను వెలికి తీసింది. తరచూ జిమ్‌ ట్రెయినర్‌ సుమిత్‌తో మాట్లాడుతున్నట్లు దానిలో గుర్తించారు. దీంతో పోలీసులు అతడి కాల్‌ డేటాను వెలికి తీయగా నిధితో సంబంధం బయటపడింది. దీంతో సుమిత్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు కుట్ర వెలుగులోకి వచ్చింది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)