Breaking News

35 సెకండ్లలో 10 సార్లు తన్నిన స్వీపర్‌ : ఎంత అమానుషం

Published on Wed, 07/01/2026 - 13:07

ఉత్తరప్రదేశ్‌లోని రాయబలేరిలోని ఒక ఆసుపత్రి ఉద్యోగిని నిస్సహాయుడైన రోగిపట్ల అమానుషంగా ప్రవర్తించిన తీరు విమర్శలకు తావిచ్చింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ కావడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అత్యంత అమానుషమైన ఘటనగా స్వయంగా అధికారులే ప్రకటించారు. యూపీ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ ఆదేశాల మేరకు ఆసుపత్రి యాజమాన్యం సదరు ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు ప్రారంభించింది.

ఈ వీడియో ప్రకారం మానసిక ఆరోగ్యంగా  సరిగ్గాలేని  యువ రోగిని కేవలం 35 సెకండ్లలో సుమారు 10 సార్లు నిర్దాక్షిణ్యంగా తన్నడమే కాకుండా నోటికొచ్చినట్లు అతనిపై దుర్బాష లాడింది. అక్కడే సెక్యూరిటీ గార్డుకూడా చోద్యం చూశాడు తప్ప ఆమెను అడ్డుకునే ప్రయత్నం  చేయలేదు. దీనిపై స్పందించిన జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పుష్పేంద్ర కుమార్ సంబంధిత ఉద్యోగినిపై చర్యలు తీసుకున్నారు. సస్పెండ్ అయిన ఉద్యోగిని ఆసుపత్రిలో స్వీపర్‌గా పనిచేస్తున్న పింకీగా గుర్తించినట్లు తెలిపారు. సస్పెన్షన్ కాలంలో పింకీని జిల్లా ఆసుపత్రిలోని ఆయుష్ (AYUSH) అవుట్‌పేషెంట్ విభాగానికి బదిలీ చేశారు. ఈ ఘటనపై నిర్ణీత కాలపరిమితిలోగా విచారణ జరిపేందుకు డాక్టర్ దినేష్ ప్రతాప్ సరోజ్ (ఆర్థోపెడిక్ కన్సల్టెంట్), డాక్టర్ రిచా (మైక్రోబయాలజిస్ట్), సుష్మా యాదవ్ (సిస్టర్-మేట్రన్) ముగ్గుర సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి: షాకింగ్‌ : భారతీయ నావికుడి బాడీలో అవయవాలన్నీ మాయం!

 అలాగే మెడికల్ అండ్ హెల్త్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ అమిత్ కుమార్ ఘోష్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చీఫ్ మెడికల్ ఆఫీసర్లందరికీ సేవా ప్రవర్తనా నియమాలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. రోగుల పట్ల దుష్ప్రవర్తన లేదా అమానుషంగా ప్రవర్తిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని  హెచ్చరించారు.

ఇదీ చదవండి: అయోధ్య విరాళాల స్కామ్‌ : మాజీ ట్రస్టీకి బిగుస్తున్న ఉచ్చు
ఇదీ చదవండి: కేతన్‌ హత్య కేసులో మరో ట్విస్ట్‌ : రూ. 10 కోట్ల డిఫమేషన్‌

 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)