Breaking News

నాటకీయ పరిణామాల మధ్య స్వతంత్ర అభ్యర్థి అరెస్ట్‌

Published on Thu, 11/14/2024 - 13:30

జైపూర్‌: రాజస్థాన్‌లోని డియోలీ-యునియారా నియోజవర్గానికి బుధవారం ఉప ఎన్నిక పోలింగ్‌ జరిగింది.అయితే.. ఈ నియోజక వర్గంలో సంరవత పోలింగ్ కేంద్రం‌లో సబ్‌ డివిజినల్‌ మేజిస్ట్రేట్‌ (ఎస్‌డీఎం)గా అధికారి అమిత్‌ చౌదరీ ఎన్నికల పోలింగ్‌ను పర్యవేక్షించారు. ఈ క్రమంలో అమిత్‌ చౌదరీపై ఈనియోజకర్గంలోస్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన నరేష్‌ మీనా చెంపదెబ్బ కొట్టడం కలకలం రేపింది. ఉప ఎన్నికలో ఎన్నికల అధికారిని  చెంపదెబ్బ కొట్టిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా హై డ్రామా మధ్య గురువారం నరేష్‌ మీనా పోలీసులు అరెస్టు చేశారు. 

పోలీసు బృందం ‘వ్యూహాత్మక’ ఆపరేషన్ చేపట్టి అతన్ని అరెస్టు చేశారు. పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకోవడానికి ముందు నరేష్‌ మీనా మీడియాతో మాట్లాడారు. ‘‘ నేను లొంగిపోను. నా మద్దతుదారులంతా పోలీసులను చుట్టుముట్టండి. ట్రాఫిక్ జామ్‌ చేయండి’’అని అనుచరులకు పిలుపునిచ్చారు.‘‘ భారీగా పోలీసులు.. లాఠీలు, షీల్డ్‌లను ధరించి.. మేము వ్యూహాత్మకంగా  అతను ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. మేం అతన్ని లొంగిపోవాలని అభ్యర్థించాం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు’’ అని చెప్పామని టోంక్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ వికాస్ సంగ్వాన్ తెలిపారు.

మరోవైపు.. పోలింగ్‌ బూత్‌లో మూడు అదనపు ఓట్లను చేర్చేందుకు చౌదరి కుట్ర పన్నారని మీనా ఆరోపించారు. అయితే పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘ కొందరు  ఎన్నికలను బహిష్కరిస్తున్నారు. ఎస్‌డీఎం, తహసీల్ అధికారులు వారిని ఒప్పించేందుకు వెళ్లారు. చర్చల సమయంలో స్వతంత్ర అభ్యర్థి (నరేష్ మీనా) ఎస్‌డీఎంను చెప్పుతో కొట్టారు’’ అని ఎస్పీ సాంగ్వాన్ వెల్లడించారు. గుర్తుతెలియని వ్యక్తులు (మీనా మద్దతుదారులు), పోలీసుల మధ్య చెలరేగిన హింసాకాండలో పోలీసు వాహనాలతో సహా ఎనిమిది కార్లు, 10పైగా మోటార్‌సైకిళ్లకు నిప్పు పెట్టారు. శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి పోలీసులు అదనపు బలగాలను మోహరించారు.

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)