Breaking News

ఆస్ట్రేలియాలో ఉగ్రదాడి.. భారత్‌లో ‘హై అలర్ట్’

Published on Sun, 12/14/2025 - 19:03

ఢిల్లీ: భారత్‌లోని పలు ప్రధాన నగరాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. దేశంలో యూదుల్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద సంస్థలు దాడులు చేయొచ్చని ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఢిల్లీ, బెంగళూరు, ముంబై నగరాల్లో హై-అలర్ట్ జారీ చేశారు.

ఇంటెలిజెన్స్‌ సమాచారం ప్రకారం.. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన బాండి బీచ్‌లో ఆదివారం సాయంత్రం 6.30 (స్థానిక కాలమానం ప్రకారం) గంటలకు కాల్పులు చోటు చేసుకొన్నాయి. ఈ కాల్పుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ఇవాళ్టి నుంచి ప్రారంభమైన యూదుల పండుగ హనుక్కా సందర్భంగా ఉగ్రవాదులు పెద్ద దాడులు చేయాలని యోచిస్తున్నట్లు భారత్‌లోని ఇంటెలిజెన్స్‌ వర్గాలకు సమాచారం అందింది. యూదుల ప్రార్థనా మందిరాలు, కమ్యూనిటీ సెంటర్లు, ఇజ్రాయెల్‌కు సంబంధించిన సంస్థల్ని ఉగ్రవాదులు ఎంపిక చేసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

హనుక్కా పండుగ ఎప్పుడు?
యూదులు ఘనంగా జరుపుకునే ఎనిమిది రోజుల పండుగ హనుక్కా. ఈ పండుగ డిసెంబర్ 14 నుండి ప్రారంభమైంది. ఈ పండుగ సమయంలో యూదులు పెద్ద సంఖ్యలో ప్రార్థనలు, వేడుకలు నిర్వహిస్తారు. అందువల్లే పండుగ పర్వదినాన భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

ఏ నగరాలు ప్రధాన టార్గెట్?
ఇంటెలిజెన్స్‌ నివేదికల ప్రకారం యూదు సంస్థలు, ప్రార్థనా మందిరాలు, కమ్యూనిటీ సెంటర్ల వద్ద భద్రత పెంచారు. విదేశీ పర్యాటకులు, ముఖ్యంగా ఇజ్రాయెల్ పౌరుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్రం, రాష్ట్రాలు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)