Breaking News

జార్ఖండ్: బ‌ల‌ప‌రీక్ష‌లో నెగ్గిన హేమంత్ సోరెన్ ప్ర‌భుత్వం

Published on Mon, 07/08/2024 - 13:04

జార్ఖండ్‌ అసెంబ్లీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్ర‌భుత్వం బ‌ల ప‌రీక్ష‌లో నెగ్గింది. జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేతృత్వంలోని పాలక కూట‌మికి అనుకూలంగా 45 మంది ఎమ్మెల్యేలు మ‌ద్ద‌తు తెల‌ప‌డంతో సోరెన్ ప్ర‌భుత్వం బ‌ల‌ప‌రీక్ష‌లో సునాయాసంగా గ‌ట్టెక్కింది.

భూ కుంభకోణం కేసులో అరెస్ట్ అయి.. దాదాపు 5 నెల‌ల త‌ర్వాత బెయిల్‌పై బ‌య‌ట‌కు వ‌చ్చారు హేమంత్ సోరెన్  ఆ త‌రువాత జూలై 4న మూడోసారి జార్ఖండ్ సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఆయ‌న‌.. సోమ‌వారం అసెంబ్లీలో బ‌ల ప‌రీక్ష‌ను ఎదుర్కొన్నారు.

జార్ఖండ్ స్పీకర్ రవీంద్రనాథ్ మహ్తో విశ్వాస తీర్మానంపై చర్చకు గంట సమయం కేటాయించారు. అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ఆమోదం పొంద‌డంతో..హేమంత్ సోరెన్ తన మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది.

కాగా  81 సీట్లున్న అసెంబ్లీలో ప్రస్తుతం 76 మంది సభ్యులున్నారు. అసెంబ్లీ బ‌ల ప‌రీక్ష‌లో నెగ్గాలంటే 338 ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ఉంటే స‌రిపోతుంది. ప్రస్తుతం అసెంబ్లీలో జేఎంఎం కూటమికి 45 మంది ఎమ్మెల్యేలున్నారు (జేఏఎంఎం 27, కాంగ్రెస్ 17, ఆర్జేడీ1).  బీజేపీ నేతృత్వంలోని ప్రతిపక్షానికి 30 మంది సభ్యులున్నారు.

Videos

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)