Breaking News

రాజ్‌కోట్‌ అగ్నిప్రమాదం.. గుజరాత్‌ సర్కారుపై హైకోర్టు ఆగ్రహం

Published on Mon, 05/27/2024 - 20:21

అ‌హ్మదాబాద్‌: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఆ రాష్ట్ర అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక మునిసిపల్‌ అధికారుల తీరుపై కోర్టు మండిపడింది.

 అమాయకుల ప్రాణాలు కోల్పోయిన తర్వాత చర్యలు చేపడతామని చెబుతోన్న రాష్ట్ర అధికారులపై తమకు నమ్మకం లేదని పేర్కొంది. అగ్నిప్రమాదం కేసును గుజరాత్‌ హైకోర్టు సోమవారం(మే27) విచారించింది. ఈసందర్భంగా రాజ్‌కోట్ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఎంసీ) అధికారులపై తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయింది. 

రెండున్నరేళ్లుగా మీ పరిధిలో ఇంత పెద్ద భవనం ఉందని.. అది కూడా ఫైర్‌సేఫ్టీ లేకుండా ఉందన్న విషయం కూడా తెలియదని ఎలా చెబుతారని జస్టిస్‌ బైరెన్‌ వైష్ణవ్‌, జస్టిస్‌ దేవాన్‌దేశాయ్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది.

 ఆ భవనం ప్రారంభ కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ కూడా పాల్గొన్నట్లు మీడియా కథనాలను బెంచ్‌ చూపించింది. ఈ అధికారులు ఎవరు.. వాళ్లంతా ఆడుకోవడానికి అక్కడికి వెళ్లారా అని  మండిపడింది. 

ఏడుగురు అధికారుల సస్పెన్షన్‌ ..

కాగా, హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన  తర్వాత గుజరాత్‌ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇద్దరు పోలీసులు సహా మొత్తం ఏడుగురు అధికారులను సస్పెండ్‌ చేసింది. వీరిలో రాజ్‌కోట్‌ మునిసిపల్‌ అధికారులు కూడా  ఉన్నారు. 

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)