‘గూగుల్‌లో వెతికా.. ఎంత పనికిమాలినోడివో!’

Published on Wed, 07/29/2026 - 06:57

జెన్‌-జీ నిరసనలపై చేసిన వ్యాఖ్యలతో వివాదంలో ఉన్న బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్‌.. తాజాగా సీజీపీ (Cockroach Janata Party) ప్రతినిధి సౌరవ్‌ దాస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన వ్యాఖ్యలను విమర్శించిన సౌరవ్‌ దాస్‌కు కౌంటర్‌గా.. అతడిని ‘‘పనికిమాలినోడు, ఉద్యోగం లేనివాడు’’ అంటూ మండిపడ్డారు. తన కెరీర్‌ విజయాలను ప్రస్తావిస్తూ విమర్శలకు బదులిచ్చారు.

సౌరవ్‌ దాస్‌ ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసిన కంగనా.. ‘‘గూగుల్‌లో ఈ వ్యక్తి గురించి వెతికాను. అతడి వయసు 28 ఏళ్లు. అతనో పనికిమాలినోడు అని అర్థమైంది. అలాంటి వ్యక్తి తనను తాను విద్యార్థి అని ఎలా చెప్పుకుంటున్నాడో అర్థం కావడం లేదు’’ అంటూ వ్యాఖ్యానించారు. ‘‘నేను రాజకీయాల్లోకి వచ్చి రెండేళ్లే కావచ్చు. కానీ ప్రజా జీవితంలోకి వచ్చి 20 ఏళ్లు అవుతోంది. అతడి వయసులోనే నేను రెండు జాతీయ అవార్డులు సాధించాను’’ అని పేర్కొన్నారు.

నటిగా, ఎంపీగా నా ప్రయాణం వేరు
తాను కేవలం రాజకీయ నాయకురాలిని మాత్రమే కాదని కంగనా అన్నారు. నటిగా, చిత్ర నిర్మాతగా, స్క్రీన్‌రైటర్‌గా, వ్యాపారవేత్తగా కూడా తన ప్రయాణం కొనసాగిందని తెలిపారు. ‘‘కొత్త ఎంపీగా బాధ్యతలు ఎక్కువగా ఉండటంతో ఒత్తిడి ఎదురైంది. ఎందుకంటే నేను ఫిల్మ్‌మేకర్‌, పెర్ఫార్మింగ్‌ ఆర్టిస్ట్‌, నిర్మాత, రచయిత్రి, వ్యాపారవేత్తగా కూడా ఉన్నాను’’ అని పేర్కొన్నారు. ఎప్పుడూ డిమాండ్‌లో ఉండటం అంటే ఏమిటో సౌరవ్‌ దాస్‌ లాంటి వారు అర్థం చేసుకోలేరంటూ విమర్శించారు.

‘ముందు నైపుణ్యం నేర్చుకో’
సౌరవ్‌ దాస్‌ను ఉద్దేశించి కంగనా మరింత ఘాటుగా స్పందించారు. ‘‘నీ సమస్యలు వ్యక్తిగతమైనవి. నువ్వు విద్యార్థివి కాదు. నువ్వు కేవలం పనికిమాలిన వ్యక్తివి. ముందు ఏదైనా నైపుణ్యం నేర్చుకోవడం ప్రారంభించు’’ అంటూ తన సోషల్‌ మీడియా పోస్టులో రాసుకొచ్చారు.

జెన్‌-జీ నిరసనలపై కంగనా వ్యాఖ్యలు
నీట్‌-యూజీ 2026 పేపర్‌ లీక్‌ ఆరోపణలపై జరిగిన విద్యార్థుల నిరసనలకు సంబంధించిన కొన్ని వీడియోలపై కంగనా గతంలో తీవ్రంగా స్పందించారు. ‘‘నా జీవితంలో ఒకే దగ్గర ఇంత కంపును ఎప్పుడూ చూడలేదు. జెన్‌-జీ నిరసనకారుల రీల్స్‌ వాంతులు తెప్పించేలా ఉన్నాయి. వారు మాట్లాడే విధానం, ఉపయోగించే భాష నేనెప్పుడూ చూడలేదు’’ అంటూ విమర్శించారు. ‘‘ఇలాంటి వారిని ఎవరు కంటున్నారు? ఎవరు పెంచుతున్నారు?’’ అంటూ ప్రశ్నించారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.

విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు
కంగనా వ్యాఖ్యలపై కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ, ఎంఐఎం నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ఎంపీ ఇమ్రాన్‌ ప్రతాప్‌గఢీ స్పందిస్తూ.. జెన్‌-జీ యువత నుంచి కంగనాకు త్వరలోనే సమాధానం వస్తుందని అన్నారు. యువతను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని విమర్శించారు. కాంగ్రెస్‌ నేత రేణుకా చౌదరి కూడా కంగన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ప్రభుత్వం నుంచి ప్రశంసలు పొందేందుకు ఒక మహిళా ఎంపీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు.

సౌరవ్‌ దాస్‌ కౌంటర్‌
కంగనా వ్యాఖ్యలకు ముందు సౌరవ్‌ దాస్‌ కూడా ఆమెపై విమర్శలు చేశారు. ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. ‘‘కంగనాను ఆమె సొంత పార్టీ నేతలే పెద్దగా పట్టించుకోరు. ఆమెను సీరియస్‌గా తీసుకోనప్పుడు మేమెందుకు తీసుకోవాలి?’’ అని అన్నారు. జెన్‌-జీ, జెన్‌ ఆల్ఫా తరాలు కంగనా వ్యాఖ్యలను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. ‘‘జెన్‌-జీ ఈ దేశానికి మీకంటే ఎక్కువ చేసింది. ఇంకా చేస్తూనే ఉంది. ప్రజాస్వామ్యంపై మళ్లీ నమ్మకం కలిగించే పని యువత చేస్తోంది’’ అని వ్యాఖ్యానించారు.

నీట్‌ నిరసనలతో మొదలైన వివాదం
నీట్‌-యూజీ పేపర్‌ లీక్‌ ఆరోపణలపై దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో సీజీపీ కీలక పాత్ర పోషించింది. దాదాపు నెల రోజుల పాటు సాగిన ఆందోళనల తర్వాత కేంద్రం కొన్ని డిమాండ్లను అంగీకరించింది. బాధిత కుటుంబాలకు పరిహారం, నిరసనకారులపై నమోదైన కేసుల ఉపసంహరణ వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ పరిణామాల తర్వాత అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయడం కూడా చర్చనీయాంశమైంది.

కొనసాగుతున్న మాటల యుద్ధం
నిరసనలు ముగిసినా.. కంగనా, సీజీపీ నేతల మధ్య మాటల యుద్ధం మాత్రం కొనసాగుతోంది. ఒకవైపు కంగనా నిరసనకారుల తీరును ప్రశ్నిస్తుండగా.. మరోవైపు సీజీపీ నేతలు ఆమె వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. తాజాగా సౌరవ్‌ దాస్‌పై కంగనా చేసిన ఘాటు వ్యాఖ్యలతో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.

Videos

600 మంది సచివాలయ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్యారడైజ్ సినిమాను వీక్షించిన కేటీఆర్

మిమ్మల్ని నమ్మి భూమి ఇస్తే... TDP బండారం మొత్తం బయటపెట్టిన అమరావతి రైతు

NTR జిల్లాలో YS జగన్ పాటలతో గణేశ్ నిమజ్జనం

చింతమనేని నీకే చెప్తున్నా.. దెందులూరు గడ్డ సాక్షిగా.. అబ్బాయి చౌదరీ నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

ఒక్కొక్కడికి ఇదే చెప్పడం.. వంగవీటి ఆశ మాస్ వార్నింగ్

తండ్రీ కొడుకుల రహస్య ప్రయాణాలు

విజయవాడ ధర్నా చౌక్ వద్ద హైటెన్నన్.. YSRCP నేతలు VS పోలీసులు

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

Photos

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)