Breaking News

విద్యార్థుల డిమాండ్లను పట్టించుకోకుండా వారి ఉద్దేశాలను ప్రశ్నిస్తారా? 

Published on Fri, 07/24/2026 - 04:57

న్యూఢిల్లీ: కాక్రోచ్‌ జనతా పార్టీ చేపట్టిన ‘సంసద్‌ చలో’ర్యాలీలో హింస జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో విద్యార్థులను ప్రతికూలంగా చిత్రీకరించడాన్ని చూడటం తీవ్ర వేదన కలిగించే విషయమని సామాజిక కార్యకర్త, పర్యావరణవేత్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ భార్య గీతాంజలి అంగ్మో పేర్కొన్నారు. విద్యార్థుల డిమాండ్లను పట్టించుకోవడం కంటే వారి ఉద్దేశాలను ప్రశ్నించడం ఎందుకు సులభంగా అనిపిస్తుందో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ మేరకు ఆమె గురువారం ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. జంతర్‌మంతర్‌ వద్ద జరుగుతున్న విద్యార్థుల నిరసనను ఢిల్లీలోని ఇతర ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక సంఘటనలతో ఎటువంటి ఆధారాలు లేకుండా ముడిపెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో తొందరపాటు వద్దని సూచించారు. 

విద్యార్థుల ఉద్యమం శాంతియుతంగానే కొనసాగుతోందని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రతిష్టను మీడియాలో మసకబార్చేలా చూపడం ఒక విద్యావేత్తగా తనకు ఎంతో బాధ కలిగిస్తోందని వెల్లడించారు. ఆందోళనకారులు అసాధారణమైన సహనం, క్రమశిక్షణ, సంయమనం ప్రదర్శించారని అంగ్మో కొనియాడారు. అలాగే సమస్యలను ప్రభుత్వం ఆలకించాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. సొంత విద్యార్థులనే అంత త్వరగా అపనమ్మకంతో చూసే వ్యవస్థ ఎలాంటిదని తాను తరచుగా ఆలోచిస్తుంటానని ఉద్ఘాటించారు. మన పిల్లలు రక్షణకు అర్హులు అని తేల్చిచెప్పారు. వారిని ప్రతినాయకులుగా చిత్రీకరించవద్దని కోరారు. వారు చెప్పేది అందరూ వినాలని వెల్లడించారు. కొందరు వ్యక్తుల స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చే కుట్రలతో విద్యార్థులను అణచివేస్తామంటే సహించవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.   
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)