Breaking News

G20 Summit: ‘కోణార్క్‌ చక్రం’ ప్రాధాన్యత ఇదే..

Published on Sat, 09/09/2023 - 13:58

జీ20 సదస్సుకు వచ్చిన ప్రపంచ నేతలకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్రగతి మైదాన్‌ వేదికగా నూతనంగా నిర్మితమైన భారత్‌ మండపం వద్దకు చేరుకున్నారు. ఇక్కడ ప్రపంచ నేతలందరితో కరచాలనం చేసి, వారిని ఘనంగా స్వాగతించారు. ఈ సమయంలో అందరి చూపు ఒడిశాలోని సూర్య దేవాలయంలో కనిపించే చక్రానికి ప్రతిరూపంగా వేదికపై ఏర్పాటు చేసిన నమూనాపై పడింది. ఇది వేదిక అందాన్ని రెండింతలు చేసింది.

చరిత్రకారుల తెలిపిన వివరాల ప్రకారం కోణార్క్ చక్రం 13వ శతాబ్దంలో నిర్మితమయ్యింది. దీనిని  రాజు నరసింహదేవ్-I పాలనలో నిర్మించారు. కోణార్క్ సూర్య దేవాలయం ఎన్నో ప్రత్యేకతలను కలిగివుంది. ఈ సూర్య చక్రంలో 24  కమ్మీలు ఉంటాయి. ఈ చక్రం భారతదేశ జాతీయ జెండాలో కూడా కనిపిస్తుంది. ఈ చక్రం భారతదేశ పురాతన విజ్ఞానం, అధునాతన నాగరికత, నిర్మాణ నైపుణ్యానికి చిహ్నంగా నిలుస్తుంది. కోణార్క్ చక్రం పురోగతిని, నిరంతర మార్పును సూచిస్తుందని చెబుతారు. 

భారత రూపాయి నోట్లపై కూడా ఈ కోణార్క్ చక్రాన్ని మనం చూడచ్చు. ఒకప్పుడు 20 రూపాయల నోటుపై ఇది కనిపించింది. అలాగే ఆపై 10 రూపాయల నోటుపై కూడా దీనిని ముద్రించారు. కోణార్క్ ఆలయంలోని ఈ చక్రాన్ని ఆధారంగా చేసుకుని సమయాన్ని లెక్కిస్తారని చెబుతారు. చక్రం పరిమాణం 9 అడుగుల 9 అంగుళాలు ఉంటుంది. 12 జతల చక్రాలు సంవత్సరంలోని 12 నెలలను సూచిస్తాయని అంటారు. ఆలయంలోని 24 చక్రాలు రోజులోని 24 గంటలను సూచిస్తాయని చెబుతారు. కాగా ఈ ఏడాది ‘వన్ ఎర్త్’ థీమ్‌తో జీ20 సమ్మిట్ మొదటి సెషన్ ప్రారంభమైంది. జీ20 శిఖరాగ్ర సమావేశం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న కీలక సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో జరుగుతుంది.
ఇది కూడా చదవండి: బెర్లిన్‌లో గణేశుని ఆలయం.. దీపావళికి ప్రారంభం

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)