ఆగని ‘నీట్‌’ బలవన్మరణాలు.. జాబితాలో..

Published on Mon, 07/27/2026 - 12:38

న్యూఢిల్లీ: ‘నీట్ యూజీ’పేపర్ లీక్, పరీక్షా విధానంలోని లోపాల కారణంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేద్ర ప్రధాన్ రాజీనామా చేయగా, సమస్యల పరిశీలన కోసం ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేశారు. అయితే, పరీక్షా వివాదాలు, మానసిక ఒత్తిడి కారణంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్న విషాదకర ఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలోని అహిల్యానగర్‌కు చెందిన అంకితా సాంగ్లే అనే విద్యార్థిని రీ ఎగ్జామ్‌లో తక్కువ మార్కులు రావడంతో, మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఇదే రకమైన మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న పలువురు విద్యార్థుల వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రదీప్ మేఘవాల్ (రాజస్థాన్): జుంఝును జిల్లాకు చెందిన 22 ఏళ్ల ఈ యువకుడు, మే 2026లో నీట్ యూజీ పరీక్ష రద్దు కావడంతో సీకర్‌లో ఆత్మహత్య చేసుకున్నారు.

ఋతిక్ మిశ్రా (ఉత్తర ప్రదేశ్): లఖింపూర్ ఖేరీకి చెందిన 21 ఏళ్ల ఈ విద్యార్థి, పరీక్షలో గందరగోళం, మానసిక ఒత్తిడి  కారణంగా బలవన్మరణానికి పాల్పడ్డారు.

సిద్దార్థ్‌ హెగ్డే (గోవా): 17 ఏళ్ల ఈ విద్యార్థి మే 2026లో నీట్ పరీక్ష రద్దయిన తర్వాత తీవ్ర మనోవేదనతో ప్రాణాలు తీసుకున్నారు.

భాగ్యశ్రీ (కర్ణాటక): కలబుర్గికి చెందిన 18 ఏళ్ల ఈ విద్యార్థిని పీయూసీ బోర్డు పరీక్షలో 92 శాతం మార్కులు సాధించినప్పటికీ, నీట్ ఆందోళనలతో మే 2026లో బలవన్మహత్వానికి పాల్పడ్డారు.

అంశిక పాండే (ఢిల్లీ): ఆదర్శ్ నగర్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల ఈ పరీక్షార్థిని మానసిక ఒత్తిడి కారణంగా ప్రాణాలు విడిచిపెట్టారు.

ఉమేష్ మాలీ(రాజస్థాన్): సీకర్‌లో నీట్ ప్రిపరేషన్ చేస్తున్న ఈ 22 ఏళ్ల యువకుడు జూన్ 15న ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నారు.

రేణు మీణా (రాజస్థాన్): అన్వర్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల ఈ ప్రతిభావంతురాలైన విద్యార్థిని జూన్ 2026లో నీట్ వివాదాల కారణంగా ప్రాణాలు తీసుకున్నారు.

రియా కుమారి థాపా (ఉత్తరాఖండ్): డెహ్రాడూన్‌కు చెందిన 23 ఏళ్ల ఈ అభ్యర్థి జూన్ 2026లో పేపర్ లీక్ ఆందోళనలతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

శివానీ యాదవ్ (ఉత్తర ప్రదేశ్): లక్నోకు చెందిన 17 ఏళ్ల విద్యార్థిని పరీక్ష రద్దు, వివాదాలతో ఆత్మహత్య చేసుకున్నారు.

కహాన్ పటేల్ (గుజరాత్): అహ్మదాబాద్‌కు చెందిన 17 ఏళ్ల ఈ విద్యార్థి జూన్ 18, 2026న అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ప్రాణాలు వదిలారు.

ఆకాంక్ష చతుర్వేది (మధ్య ప్రదేశ్): మౌగంజ్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల ఈ విద్యార్థిని నాగ్‌పూర్‌లో ఆత్మహత్య చేసుకున్నారు.

రీమా బేగం (అస్సామ్): 21 ఏళ్ల ఈ నీట్ అభ్యర్థి జూన్ 2026లో మానసిక ఒత్తిడితో ప్రాణాలు విడిచారు.

అవంతిక మౌర్య (మధ్య ప్రదేశ్): ఇండోర్‌కు చెందిన 21 ఏళ్ల ఈ విద్యార్థిని అనుమానాస్పద రీతిలో భవనంపై నుంచి పడి  మృతి చెందారు.

జతిన్ కుమార్ (ఉత్తర ప్రదేశ్): ఘజియాబాద్‌కు చెందిన 22 ఏళ్ల ఈ విద్యార్థి జూన్ 2026లో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఎస్. గోపిక (తమిళనాడు): సేలం జిల్లాకు చెందిన 19 ఏళ్ల ఈ విద్యార్థిని జూన్ 19, 2026న రీ-టెస్ట్ ఒత్తిడితో ప్రాణాలు విడిచారు.

షేక్ సనా (తెలంగాణ): హైదరాబాద్‌కు చెందిన 19 ఏళ్ల ఈ విద్యార్థిని జూన్ 21, 2026న జరగాల్సిన రీ-నీట్ పరీక్షకు సరిగ్గా ఒక్క రోజు ముందు ఆత్మహత్య చేసుకున్నారు.

వెత్రియానందం (తమిళనాడు): హోసూర్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల  విద్యార్థి జూన్ 2026లో పరీక్షా వివాదాల కారణంగా ప్రాణాలు తీసుకున్నారు.

సిమ్రన్ (హర్యానా): హిసార్‌కు చెందిన 19 ఏళ్ల ఈ విద్యార్థిని జూన్ 21, 2026న పునఃపరీక్షకు ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

రోషిణి (తమిళనాడు): ధర్మపురి జిల్లాకు చెందిన 19 ఏళ్ల ఈ విద్యార్థిని జూన్ 2026లో పరీక్షా ఒత్తిడి కారణంగా బలవన్మహత్వానికి పాల్పడ్డారు.

అంకితా సాంగ్లే (మహారాష్ట్ర): అహిల్యానగర్ జిల్లాకు చెందిన 19 ఏళ్ల ఈ విద్యార్థిని నీట్ పరీక్షలో తక్కువ మార్కులు వచ్చిన కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

ఇది కూడా చదవండి: ‘జంతర్ మంతర్’ లవ్‌ స్టోరీ.. తలకు గాయంతో వివాహం!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)