Breaking News

12 నూక్లియర్‌ ఆయుధాలు మోహరింపు : ఇండియా వ్యూహాత్మక మార్పు!

Published on Tue, 06/09/2026 - 15:43

సాక్షి, న్యూఢిల్లీ: అణ్వాయుధ విధానానికి సంబంధించి ఇండియా ముఖ్యమైన అణు వ్యూహాత్మక మార్పుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తొలిసారిగా 12 అణ్వాయుధాలను (Nuclear Warheads) మోహరిం చిందంటూ అంతర్జాతీయ పరిశోధన సంస్థ  (సిప్రి) రిపోర్ట్‌ సంచలనంగా మారింది.  అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుకునే  క్రమంలో ఇప్పటికే దేశం వద్ద 190 అణ్వాయుధాలుఉన్నాయని ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆయుధ పర్యవేక్షణ సంస్థ   SIPRI ఈ నివేదిక  తాజాగా విడుదల చేసింది.

స్టాక్‌హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ (SIPRI) తాజా నివేదిక ప్రకారం భారతదేశం మొట్టమొదటి సారిగా 12 అణ్వాయుధాలను మోహరించింది. భారతదేశం తన దశాబ్దాల కాలపు అణువిధానాన్ని పక్కనబెట్టి, తొలిసారిగా 12 అణు వార్‌హెడ్‌లను వ్యూహాత్మకంగా మోహరించింది. గతంలో అణు వార్‌హెడ్‌లను, వాటిని ప్రయోగించే క్షిపణులను వేర్వేరు నిల్వ కేంద్రాలలో భద్రపరిచే విధానాన్ని (Separate Storage Policy) భారత్ అనుసరించేది. అయితే ఇప్పుడు వాటిని సిద్ధంగా ఉంచడం ద్వారా దేశ రక్షణలో ఉన్నత స్థాయి సంసిద్ధతకు సంకేతమని తెలిపింది.

శాంతిసమయంలో కూడా క్షిపణులను సిద్ధంగా ఉంచడం, సముద్రంలో నిరంతర నిఘా లాంటి చర్యలు భారతదేశ రక్షణ సంసిద్ధతను సరికొత్త స్థాయికి తీసుకెళ్లాయని SIPRI నివేదిక వెల్లడిస్తోంది. అయితే దశాబ్దాలుగా అణ్వాయుధాలను, వాటిని ప్రయోగించే వ్యవస్థలను వేర్వేరు నిల్వ కేంద్రాలలో ఉంచే విధానానికి బదులుగా ఇది విరుద్ధమైన చర్య అని పేర్కొంది.

ఇదీ చదవండి: 10 రోజులు లీవ్‌ తర్వాత ఉద్యోగికి బాస్‌ బంపరాఫర్‌
నివేదికలోని ముఖ్యాంశాలు 
భారత అణు చరిత్రలో ఈ వార్‌హెడ్‌లను కేవలం నిల్వ ఉంచడమే కాకుండా, ప్రయోగానికి సిద్ధంగా ఉన్నట్లు (Operationally Deployed) వర్గీకరించడం ఇదే మొదటిసారి.  ఈ 12 వార్‌హెడ్‌లను క్షిపణులతో అనుసంధానించడం (Mating) లేదా సముద్రగర్భ నిఘా నిర్వహించే అణు జలాంతర్గాములపై (SSBNs) ఉంచడం ద్వారా క్షేత్రస్థాయి దళాల వద్ద సిద్ధంగా ఉంచారు.

2026 జనవరి నాటికి భారతదేశం వద్ద ఉన్న మొత్తం అణు ఆయుధాల సంఖ్య 190కి చేరిందని అంచనా (గత ఏడాదితో పోలిస్తే స్వల్పంగా పెరిగింది). ఇవి వైమానిక, భూతల మరియు సముద్ర రక్షణ వ్యవస్థలతో అనుసంధానించబడి ఉన్నాయి.  

ఇదీ చదవండి: 40ల తరువాత అల్ట్రామారథాన్‌ : తృటిలో తప్పిన ముప్పు

"నో ఫస్ట్ యూజ్" (No First Use) విధానం
అణ్వాయుద విధానంలో వ్యూహాత్మక మార్పు జరిగినప్పటికీ,  ఇండియా తన ప్రాథమిక అణు విధానమైన "నో ఫస్ట్ యూజ్" (మొదటగా అణు దాడి చేయకూడదు) అనే సూత్రానికే కట్టుబడి ఉంది. శత్రు దేశాలు అణు దాడికి పాల్పడితే మాత్రమే, ప్రతీకార చర్యగా మాత్రమే, భారత్ తన అణు ఆయుధాలను ఉపయోగిస్తుంది. అంతేకాదు భారతదేశం పమర్థవంతమైన అణ్వాయుధాలను కలిగి ఉంది. ఈ సామర్థ్యం ఆయుధ పోటీలో పాల్గొనడానికి కాకుండా, కేవలం దురాక్రమణదారులను నిరోధించడానికే రూపొందించబడింది.భారత్ అణుసామర్థ్యం పరిమితమైనప్పటికీ, దీన్ని ఆయుధాల పోటీ కోసం కాకుండా,  దేశ రక్షణ కవచంగా మాత్రమే భావిస్తుంది.

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)