Breaking News

212 మంది భారతీయుల తరలింపు

Published on Sat, 10/14/2023 - 05:43

న్యూఢిల్లీ:  హమాస్‌ మిలిటెంట్ల దాడులతో రణరంగంగా మారిన ఇజ్రాయెల్‌ నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతోంది. దాదాపు 212 మందితో టెల్‌ అవివ్‌ నుంచి బయలుదేరిన మొదటి విమానం శుక్రవారం ఢిల్లీకి చేరుకుంది. వీరిలో చాలామంది విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారు. విమానంలో వచ్చిన భారతీయులకు ఎయిర్‌పోర్టులో కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ వారికి స్వాగతం పలికారు. కరచాలనం చేశారు.

ఇజ్రాయెల్‌లో తమకు ఎదురైన భయానక అనుభవాలను భారతీయులు పంచుకున్నారు. సైరన్ల మోతతో నిద్రలేచేవాళ్లమని, ఎప్పుడేం జరుగుతుందో తెలియక ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడిపామని, షెల్టర్లలో తలదాచుకున్నామని శశ్వంత్‌ సింగ్‌ అనే వ్యక్తి చెప్పాడు. ఆయన తన భార్యతో కలిసి ఢిల్లీకి చేరుకున్నాడు. తమను క్షేమంగా స్వదేశానికి చేర్చిన భారత ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశాడు.

ఇజ్రాయెల్‌ నుంచి భారతీయులను వెనక్కి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్‌ అజయ్‌’ ప్రారంభించింది. ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం 18,000 మంది భారతీయులు ఉన్నట్లు అంచనా. వెస్ట్‌బ్యాంకు, గాజాలోనూ కొందరు భారతీయులు నివసిస్తున్నారు. ‘ఆపరేషన్‌ అజయ్‌’లో భాగంగా రెండో విమానం శుక్రవారం సాయంత్రం టెల్‌ అవివ్‌ నుంచి బయలుదేరింది. శనివారం భారత్‌కు చేరుకోనుంది.   
ఆపరేషన్‌ అజయ్‌లో భాగంగా ఇజ్రాయెల్‌ నుంచి ఢిల్లీకి చేరుకున్న భారతీయులు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)