Breaking News

ఫరీదాబాద్‌ కేసు: చేసిందంతా మామనే.. ఎంత దారుణం

Published on Sat, 06/28/2025 - 11:33

ఫరీదాబాద్‌: హర్యానాలోని ఫరీదాబాద్‌లో రెండు నెలలుగా కనిపించకుండా పోయిన మహిళ  కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. ఆ మహిళ మృతదేహాన్ని ఆమె అత్తమామలే స్వయంగా తమ ఇంటి ముందు పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తులో  మామనే ఆమైపై అత్యాచారం చేసి, హత్య చేశారని వెల్లడయ్యింది. ఇందుకు మృతురాలి అత్త, భర్త కూడా సహకరించారని తెలుస్తోంది.

మృతురాలు తన్ను ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలోని షికోహాబాద్‌కు చెందినది. ఆమెకు రెండేళ్ల క్రితం అరుణ్ సింగ్‌తో వివాహమయ్యింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, మామ భూప్ సింగ్, అతని భార్యను పోలీసులు అరెస్టు చేశారు. తన్ను భర్త అరుణ్ పరారీలో ఉన్నాడు. తమ కోడలు తన్ను అదృశ్యమయ్యిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి, ఈ విషయం బయటకు పొక్కకుండా అత్తామామలు జాగ్రత్తపడ్డారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏప్రిల్ 21న రాత్రి అరుణ్ తన భార్య తన్ను తినే ఆహారంలో నిద్రమాత్రలు కలిపాడు. అర్థరాత్రి తన్ను గదిలోకి ప్రవేశించిన మామ  అపస్మారక స్థితిలో ఉన్న ఆమెపై అత్యాచారం చేసి, ఆపై ఆమె గొంతు నులిమి హత్య చేశాడు.  

ఈ దారుణం తర్వాత అతను తన కుమారుడు అరుణ్‌ను పిలిచాడు. వారిద్దరూ కలిసి తన్ను మృతదేహాన్ని.. అప్పటికే వీధిలో తవ్విన గొయ్యిలో పడవేసి, దానిపై ఇటుకలు, మట్టిని పోశారు. ఆ గొయ్యి మురుగునీటి కోసం తవ్వినదని భూప్ సింగ్ చుట్టుపక్కలవారికి తెలిపాడు. దీనిపై అనుమానించిన ‍స్థానికులు తహశీల్దార్‌కు ఫిర్యాదు  చేశారు. ఆయన ఆ గొయ్యిని తవ్వించగా, తన్ను మృతదేహం బయటపడింది. ఈ ఘటనలో పోలీసులు మామ భూప్ సింగ్, అతని భార్య సోనియా, కుమారుడు అరుణ్ సింగ్ కుమార్తె కాజల్‌పై కేసు నమోదు చేశారు. కాగా తమ
కుమార్తె తన్నును కట్నం కోసం అత్తమామలు వేధిస్తున్నారని, వివాహం తర్వాత కూడా  తమ కుమార్తె ఏడాదిపాటు తమ ఇంటిలోనే ఉన్నదని ఆమె తండ్రి  రోదిస్తూ మీడియాకు తెలిపాడు.

ఇది కూడా చదవండి:‘మధ్యవర్తిత్వం’ చట్టవిరుద్ధం.. పాక్‌కు భారత్‌ మరో షాక్‌

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)