Breaking News

ఎన్‌కౌంటర్‌ భయం : ఆ నిందితులకు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు

Published on Fri, 11/06/2026 - 19:28

ఫేక్ ఎన్‌కౌంటర్ (fake encounter) చేస్తారనే భయంతో  ఖైదీలుగా ఉన్న ఇద్దరు గ్యాంగ్‌స్టర్లు  బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు కోరడం నెట్టింట హాట్‌ టాపిక్‌గా నిలిచింది.  ఉత్తరప్రదేశ్‌లోని తిహార్ జైలు నుండి శామ్లీ కోర్టుకు తరలించే సమయంలో తమకు సంకెళ్లు, బేడీలు వేయడంతో పాటు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు కూడా అందించాలని వీరు అభ్యర్థించారు. దీన్ని కోర్టు అంగీకరించి, సంబంధిత ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.

యూపీ పోలీసులు తమను ఎన్‌కౌంటర్‌  పేరుతో చంపేస్తారనే భయం ఉందంటూ నిందితుల తరఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.  పటియాలా హౌస్ కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జి సౌరభ్ ప్రతాప్ సింగ్ లాలెర్ ఈ విజ్ఞప్తిని పురస్కరించుకుని, శామ్లీలోని చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ (CJM) కోర్టుకు, తిరిగి తిహార్ జైలుకు తీసుకొచ్చే సమయంలో ​కూడా నిందితులకు బేడీలు, బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు ధరింప జేయాలని నవంబరు 3న జైలు అధికారులను ఆదేశించారు. నిందితులకు పూర్తి భద్రత కల్పించా లంటూ జైలు అధికారులు, డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసులను కోర్టు ఆదేశించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని స్పష్టం చేస్తూ, ఈ ఉత్తర్వుల ప్రతులను జైలు సూపరింటెండెంట్, సంబంధిత పోలీస్ అధికారులకు తక్షణమే పంపాలని  కూడాబఆదేశించింది. 

ఇదీ చదవండి: వామ్మో..ఆ స్పీడ్‌ ఏంటి! నువ్వు లక్కీ బ్రో..!

ఆగస్టులో శామ్లీలోని కొత్వాలి ప్రాంతంలోని ఒక జిమ్ వెలుపల హర్యానా గాయకుడు అంకిత్ బాలియాన్‌ను కాల్చి చంపిన కేసులో దీపక్ అలియాస్ తీతర్, యోగేష్ అలియాస్ తుండా అనే ఈ ఇద్దరు గ్యాంగ్‌స్టర్లను  శామ్లీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్నారు. దర్యాప్తులో భాగంగా వారిని ట్రాన్సిట్ రిమాండ్‌పై శామ్లీ కోర్టులో హాజరు పరుస్తారు.

ఇదీ చదవండి: అమెరికాలో అదిరిపోయిన సంబరాలు : తొలిసారి ఐదు రాష్ట్రాల్లో ఘనంగా దీపావళి

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)