Breaking News

నిరసనకారులపై ఏఐ నజర్‌!

Published on Sat, 07/25/2026 - 06:11

న్యూఢిల్లీ: విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకు రావాలని, పేపర్‌ లీకేజీలను అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ కాక్రోచ్‌ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద యువత, విద్యార్థు లు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. అయితే, ఉద్యమకా రులపై పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టారన్న ఆరోపణలు వస్తున్నాయి. జంతర్‌మంతర్‌ వద్ద నిరసనకు సంబంధించిన వీడియోలను చాలామంది ‘ఎక్స్‌’లో పోస్టు చేస్తున్నారు. నిరసన కారులు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అనేది కచ్చితంగా గుర్తించడానికి ఢిల్లీ పోలీసులు కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత ముఖ గుర్తింపు(ఫేసియల్‌ రికగ్నిషన్‌) వ్యవస్థలను ఉపయోగిస్తున్నారని నెటిజన్లు పేర్కొంటున్నారు.

 కాక్రోచ్‌ జనతా పార్టీ ‘ఎక్స్‌’లో పోస్టుచేసిన వీడియో క్లిప్‌లలో 360 డిగ్రీల కెమెరాలతో కూడిన లైవ్‌ సీసీటీవీ నిఘా వాహనం ద్వారా తీసిన దృశ్యాలు కనిపిస్తు న్నాయి. వాహనం లోపల ఉన్న స్క్రీన్‌ మీద కొందరు నిరసనకారుల పేర్లు, ఫొటోలు, ఇతర వివరాలు కూడా దర్శనమి స్తున్నాయి. ఆ వీడియో ల్లో ఎక్కడా ఆధార్‌ కార్డు వివరాల ప్రస్తావన లేదు. అయితే, వ్యక్తుల ముఖాలను స్కాన్‌ చేసిన తర్వాత వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి ఇచ్చే వ్యవస్థను పోలీసులు ఉపయో గిస్తున్నట్లు నిరసనకారులు అనుమానిస్తున్నారు. 

ఇది ఆధార్‌తో లేదా మరేదైనా ప్రభుత్వ డేటా బేస్‌తో అనుసంధానమై ఉండొచ్చని అంటున్నా రు. పోలీసులు ఆధార్‌ డేటాను ఉపయోగిస్తున్నట్లు అధికారిక ధ్రువీకరణ లేదు. తమ సాంకేతిక వ్యవస్థను ఆధార్‌ డేటాబేస్‌తో అనుసంధానించినట్లు ఢిల్లీ పోలీసులు చెప్పడం లేదు.  జంతర్‌మంతర్‌ వద్ద నిరసన ప్రదేశానికి సమీపంలో ఢిల్లీ పోలీసులు రెండు నిఘా వాహనాలను ఏర్పాటు చేశారు. వాటిలో ఒకటి మొబైల్‌ పర్యవేక్షణ యూనిట్‌గా పనిచేస్తూ, ఆ ప్రాంతం చుట్టూ అమర్చిన సీసీటీవీ కెమెరాల నుండి ప్రత్యక్ష ప్రసారాలను స్వీకరిస్తుంది. రెండో వాహనం కృత్రిమ మేధను ఉపయోగించి ఆ వీడియో ఫీడ్‌లను విశ్లేషించి, కెమెరాలో బంధించిన ముఖాలను పోలీసుల డేటాబేస్‌లో అందుబాటులో ఉన్న చిత్రాలతో పోల్చి చూస్తుంది. 

నిరసనకారులను ప్రత్యక్షంగా గుర్తించడానికి ఢిల్లీ పోలీసులు ఫేషియల్‌ రికగ్నిషన్‌ వ్యాన్‌లను మోహరించారని, వారు అక్కడికక్కడే బయో మెట్రిక్‌ వివరాలను సేకరించి, వ్యక్తిగత డేటాను వెలికితీస్తున్నారని కాక్రోచ్‌ జనతా పార్టీ వెల్లడించింది. అయితే, తమ ఉద్దేశశం నిరసనకారులందరినీ గుర్తించడం కాదని పోలీసు అధికారులు చెబుతున్నారు. జన సమూహంలో నేర చరిత్ర ఉన్నవారు ఎవరైనా కనిపిస్తే పోలీసులను అప్రమత్తం చేయడమే దీని లక్ష్యమని పేర్కొంటున్నారు. ‘‘నేరగాళ్ల ఫొటోలతో కూడిన ఒక పెద్ద డేటాబేస్‌ మా దగ్గర ఉంది. అందువల్ల జంతర్‌మంతర్‌ ప్రాంతంలోని వివిధ సీసీటీవీ కెమెరాల నుంచి మాకు అందిన ఫుటేజ్‌ ఆధారంగా ముఖ గుర్తింపు చేస్తాం. తద్వారా అక్కడ నేరగాళ్లు ఉంటే అదుపులోకి తీసుకోవడం సాధ్యమవుతుంది’’ అని పోలీసులు స్పష్టంచేశారు. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)