Breaking News

కేజ్రీవాల్‌కు క్లీన్‌ చిట్‌, అన్నా హజారే కీలక వ్యాఖ్యలు

Published on Sat, 02/28/2026 - 13:07

లిక్కర్ పాలసీ  కేసులో  ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)  నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా 21 మందిని కోర్టు ఈ కేసు నుండి విముక్తి చేసింది. ఈ కేసులో ఉద్దేశ పూర్వక కుట్ర ఏదీ లేదని తీర్పు చెప్పింది. అలాగే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)ని తప్పుబట్టింది. దీనిపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే (Anna Hazare) స్వాగతించారు. న్యాయ వ్యవస్థే అత్యున్నతమై నదని, కోర్టు తీర్పును అందరూ గౌరవించాలని హజారే పేర్కొన్నారు.  

మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లాలోని తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో విలేకరులతో  మాట్లాడుతూ "మన దేశం న్యాయవ్యవస్థపై నడుస్తుంది. దేశంలో న్యాయ వ్యవస్థ అత్యున్నతమైంది. దాని కారణంగనే పలు రాజకీయ పార్టీలు, అనేక కులాలు,మతాలతో కూడిన  మన దేశం సవ్యంగా నడుస్తోందని హజారే వ్యాఖ్యానించారు. బలమైన న్యాయవ్యవస్థ లేనప్పుడు, నేరస్థులు పైచేయి సాధిస్తారు, దేశంలో అల్లర్ల లాంటి పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. గతంలో తాను చేసిన విమర్శలు అప్పట్లో ఉన్న ఆరోపణల ఆధారంగా చేసినవేనని, ఇప్పుడు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినందున దానిని అంగీకరిస్తున్నానని చెప్పారు. అంతేకాదు 2011 నాటి 'ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్' ఉద్యమంలో వీరంతా కలిసి పనిచేసిన విషయాన్ని గుర్తు చేస్తూ కేజ్రీవాల్, సిసోడియాలు తన వాళ్లేనని హజారే అభివర్ణించడం విశేషం. 

అన్నా హజారే సలహా
కోర్టు తీర్పు తర్వాత కేజ్రీవాల్‌కు అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు హజారే ఒక ముఖ్యమైన సూచన చేశారు. సొంత పార్టీ లేదా స్వ ప్రయోజనాల కోసం లేదా పార్టీ కోసం కాకుండా, సమాజం మరియు దేశం కోసం పని చేయాలని సూచించారు. లిక్కర్‌ పాలసీ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్  అయిన సమచంలో అవినీతి వ్యతిరేక ఉద్యమం నుండి వచ్చిన వ్యక్తి ఇలాంటి కేసులో చిక్కుకోవడంపై హజారే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేజ్రీవాల్ కోట్లాది మంది దేశవాసుల నమ్మకాన్ని మోసం చేశారని, రాజకీయ ఆశయాలు 2011 అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని నాశనం చేశాయని కూడా ఆయన ఆరోపించిన సంగతి తెలిసిందే.  తాజా కోర్టు తీర్పుతో  తన వైఖరిని మార్చుకున్నారు.

కాగా మార్చి 21, 2024న ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కేజ్రీవాల్‌ అరెస్టు చేసింది. తరువాత అవినీతి ఆరోపణలను విచారిస్తున్న CBI అరెస్టు చేసి, 155 రోజులు జైలులో గడిపిన తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. 

ఇదీ చదవండి: Yoga ఉత్కటాసనం ప్రయోజనాలు అమోఘం, ఈ జాగ్రత్తలు మస్ట్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)