Breaking News

‘ట్రంప్ వ్యక్తిగత దౌత్య విధానం.. భారత్‌కు అనుకూలం’

Published on Thu, 11/07/2024 - 15:28

ఢిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌ ఎన్నికవటం దౌత్యపరంగా భారత్‌కు అనుకూలమని అమెరికాలో భారత మాజీ రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ అభిప్రాయపడ్డారు. ట్రంప్ వ్యక్తిగత దౌత్య విధానం భారత్‌కు అనుకూలంగా పని చేస్తుందని తెలిపారు. ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘భారత ప్రధాన నరేంద్ర మోదీపై తనకు అభిమానం ఉందని చెప్పడానికి  డొనాల్డ్‌ ట్రంప్‌ ఎప్పుడూ  వెనుకడుగు వేయలేదు. మోదీని ట్రంప్‌ స్నేహితుడిగా, బలమైన నాయకుడిగా భావిస్తారు. ఈ క్రమంలో ట్రంప్‌ వ్యక్తిగత దౌత్యం భారత్‌కు అనుకూలంగా పని చేస్తుంది. పరిపాలన మార్పులు గతంలో విజయవంతంగా జరిగాయి. ప్రతీ ప్రభుత్వ పరిపాలన ద్వారా ఇరుదేశాల మధ్య మెరుగైన లౌకిక బంధాల్లో అభివృద్ధి చెందాయి.

...ఇరు దేశాల మధ్య దౌత్య వ్యవహారాల విషయంలో ఎవరు (ట్రంప్ లేదా కమలా హారిస్) అధ్యక్ష పదవి చేపడతారనే ఆందోళన భారత్‌కు ఉందని  భావించటం లేదు. అయితే.. అధ్యక్షుడిగా జో బిడెన్ పరిపాలన కంటే ట్రంప్ పరిపాలనపై భారత్‌ ప్రాధాన్యతనిచ్చే కొన్ని అంశాలు ఉన్నాయని భావిస్తున్నా. ఇక.. పరిపాలనలో మార్పు వచ్చిన ప్రతిసారీ కొన్ని అడ్డంకులు సాధారణంగానే ఉంటాయి. 

...అమెరికా ఒక ప్రపంచ శక్తి.. ఇది ప్రపంచస్థాయి నిర్ణయాలతో పాలన కొనసాగింస్తుంది. కొన్నిసార్లు అమెరికా తీసుకునే నిర్ణయాలు.. ప్రపంచ స్థాయిలో పరోక్షంగా ప్రభావం చూపుతాయి. అయితే.. ట్రంప్ భారతదేశానికి మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సుంకాలు, వాణిజ్యం వంటి కొన్ని అంశాల్లో మార్పులను ప్రవేశపెడితే.. అది మనపై కూడా ప్రభావం చూపుతుంది’’ అని తెలిపారు.

చదవండి: Donald Trump: మళ్లీ హౌడీ.. అంటారా?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)