Breaking News

మాజీ కేంద్ర మంత్రి ఉన్నికృష్ణన్ కన్నుమూత

Published on Tue, 03/03/2026 - 10:28

కోజికోడ్: భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నేత కేపీ ఉన్నికృష్ణన్ (89) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన 1980, 90వ దశకాల్లో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. గత కొంతకాలంగా ఆయన వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో  బాధపడుతున్నారు. కేరళలోని కోజికోడ్‌లో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వడకర నియోజకవర్గం నుంచి వరుసగా ఆరుసార్లు లోక్‌సభకు ఎన్నికై రికార్డు సృష్టించిన ఉన్నికృష్ణన్.. విలువలతో కూడిన రాజకీయాలకు నిలువుటద్దంగా నిలిచారని చెబుతుంటారు.

జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించిన ఉన్నికృష్ణన్ రాజకీయాల్లోకి ప్రవేశించి, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. 1971లో తొలిసారిగా కాంగ్రెస్ అభ్యర్థిగా వడకర నుంచి పార్లమెంటులో అడుగుపెట్టిన ఆయన, ఆ తర్వాత 1977, 1980, 1984, 1989, 1991 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. వీపీ సింగ్ కేబినెట్‌లో ఉపరితల రవాణా, కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా పనిచేశారు.నాడు గల్ఫ్ యుద్ధ సమయంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించే  ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించి, అందరి ప్రశంసలు అందుకున్నారు.

ఉన్నికృష్ణన్ ఆదర్శాలకు కట్టుబడి నడుచుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. వి.కె. కృష్ణమీనన్‌కు అత్యంత సన్నిహితుడిగా, ఒకానొక సమయంలో ఇందిరా గాంధీకి నమ్మకస్తుడైన అనుచరుడిగా ఉన్నప్పటికీ, సిద్ధాంతపరమైన విభేదాల కారణంగా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. అనంతరం కాంగ్రెస్ (యూ), కాంగ్రెస్ (ఎస్) పార్టీల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. 1981-84 మధ్య కాలంలో పార్లమెంటులో కాంగ్రెస్ (సెక్యులర్) పక్ష నేతగా, 1980-82లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. సుదీర్ఘ విరామం తర్వాత 1995లో తిరిగి సొంతగూడు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

1936 సెప్టెంబర్ 20న జన్మించిన ఉన్నికృష్ణన్ విద్యాభ్యాసం మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో సాగింది. చెన్నైలోనే న్యాయశాస్త్ర పట్టా పొందిన ఆయన విద్యార్థి దశలోనే సోషలిస్ట్ పార్టీ, ప్రజా సోషలిస్ట్ పార్టీల ద్వారా రాజకీయ ఓనమాలు దిద్దారు. 1960వ దశకంలో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరి, 1962 నాటికే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) సభ్యుడిగా ఎదిగారు. ఒక జర్నలిస్టుగా, న్యాయవాదిగా, పార్లమెంటేరియన్‌గా పేరుగాంచిన ఆయన మృతికి పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఖమేనీ హత్య: కేంద్రం తీరుపై నిప్పులు చెరిగిన సోనియా

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)