Breaking News

Sabarimala Theft Case.. మాజీ అధికారి అరెస్ట్‌

Published on Sat, 11/01/2025 - 10:35

తిరువనంతపురం: ‍కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో బంగారం చోరీ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. తాజాగా ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుధీష్ కుమార్‌ను ఈ కేసులో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)అధికారులు.. సుధీష్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని, విచారించిన దరిమిలా ఈ అరెస్ట్‌ జరిగింది.

ఆలయ ద్వారం వద్దనున్న శిల్పాలకు పూత పూసిన పొరలు బంగారంతో తయారు చేసినవని తెలిసినప్పటికీ, సుధీష్ కుమార్ అధికారిక పత్రాలలో  వాటిని రాగి పొరలుగా తప్పుగా నమోదు చేసినట్లు దర్యాప్తు అధికారులు కనుగొన్నారని ఎన్‌డీటీవీ తన కథనంలో పేర్కొంది. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి మహసర్ (అధికారిక రికార్డు)ను ట్యాంపరింగ్ చేసి, బంగారాన్ని దొంగిలించేందుకు సుధీష్ కుమార్ సహాయం చేశాడని సిట్‌ నిర్ధారించింది. 2019లో శబరిమల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా వ్యవహరించిన సుధీష్ నాడు ఉన్నికృష్ణన్ పొట్టిని దాతగా ఆమోదించారు. దీనికితోడు దేవస్వం బోర్డు ఆ బంగారు పొరలను రాగి పలకలుగా చెప్పాలంటూ ఉన్నికృష్ణన్ పొట్టిని కోరిందని సిట్‌ గుర్తించింది. అధికారులు శిల్పాలను ట్యాంపరింగ్ చేసినప్పుడు కూడా, సుధీష్ వాటిని రికార్డులలో రాగి పొరలుగా పేర్కొన్నారు.

అయితే పొట్టికి ఆ షీట్లు అందకపోయినా, సుధీష్ అతని పేరును రికార్డులలో రాశారని చూపించే ఆధారాలను ​​సిట్‌ స్వాధీనం చేసుకుంది. సుధీష్ మరో నిందితుడు మురారి బాబుకు ఈ బంగారం చోరీలో సహాయం చేశాడని కూడా దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. సుధీష్ కుమార్‌ను అధికారులు (ఈరోజు) శనివారం కోర్టు ముందు హాజరుపరచనున్నారు.  తదుపరి విచారణ కోసం అతనిని తిరిగి కస్టడీకి కోరే అవకాశం ఉందని సమాచారం.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)