Breaking News

రాహుల్‌ నుంచి అమితాబ్‌ వరకు...

Published on Sat, 04/22/2023 - 05:15

న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమం ట్విటర్‌లో అధికారిక ఖాతాలకు ఇచ్చే బ్లూ టిక్‌ను మన దేశంలో చాలా మంది ప్రముఖులు కోల్పోయారు. సబ్‌స్క్రిప్షన్‌ చెల్లించకపోవడంతో భారత్‌లో రాహుల్‌ గాంధీ నుంచి అమితాబ్‌ బచ్చన్‌ వరకు రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖుల అకౌంట్ల నుంచి బ్లూ టిక్‌లను తొలగించారు. ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఆదాయాన్ని పెంచుకోవడానికి బ్లూటిక్‌ కావాలంటే సబ్‌స్క్రిప్షన్‌ ఫీజు కట్టాలన్న నిబంధన తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

అలా డబ్బులు చెల్లించని వారి ఖాతాల నుంచి బ్లూటిక్‌లను తొలగించే కసరత్తు ట్విటర్‌ ప్రారంభించింది. దీంతో వేలాది మంది సెలబ్రిటీలు బ్లూటిక్‌ను కోల్పోయారు. కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ, సోదరి ప్రియాంకా గాంధీ, యోగి ఆదిత్యనాథ్, మమతా బెనర్జీ,  ఎంకే స్టాలిన్, నితీష్‌ కుమార్‌ సహా పలువురు సీఎంలు, బాలీవుడ్‌ నటులు అమితాబ్‌ బచ్చన్, షారూక్‌ ఖాన్, సల్మాన్‌ ఖాన్, అలియా భట్, అనుష్క శర్మ తదితరులు బ్లూ టిక్‌ కోల్పోయిన వారి జాబితాలో ఉన్నారు.

బ్లూ టిక్‌ కోల్పోయిన అంతర్జాతీయ ప్రముఖుల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ ఉన్నారు. ట్విటర్‌లో బ్లూ టిక్‌ స్టేటస్‌ సింబల్‌గా మారింది. బ్లూటిక్‌కు వెబ్‌లో రూ.650, మొబైల్‌ ఫోన్లలో ఉండాలంటే నెలకి రూ.900 ఫీజుగా నిర్ణయించారు. ఏడాదికి ఒకేసారి కడితే రూ6,800 డిస్కౌంట్‌ రేటు పెట్టారు. దీనిపై గందరగోళం నెలకొనడంతో కొన్నాళ్లు దీనిని నిలిపివేశారు. ఇప్పుడు మళ్లీ  బ్లూ టిక్‌లపై దృష్టి సారించారు.

డబ్బులు కట్టినా.. ఏమిటిది ?
బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌కి వింత అనుభవం ఎదురైంది. సబ్‌స్క్రిప్షన్‌ కట్టినప్పటికీ ఆయన ఖాతా నుంచి బ్లూ టిక్‌ను తొలగించారు. దీనిపై అమితాబ్‌ ఫన్నీగా ట్వీట్‌ చేశారు. ‘‘హే ట్విటర్‌ బ్రో,  వింటున్నావా ? నేను ఇప్పటికే డబ్బులు కట్టాను. నా పేరు ముందు ఆ బ్లూ టిక్‌ మళ్లీ పెట్టు. దాని వల్ల అది నేనేనని ప్రజలు గుర్తిస్తారు’’ అని ట్వీట్‌ చేశారు. నటుడు ప్రకాశ్‌ రాజ్‌ బై బై బ్లూ టిక్‌ అంటూ ఒక హ్యాష్‌ ట్యాగ్‌ను జోడించారు. బ్లూ టిక్‌ లేకపోయినా తన జీవన ప్రయాణంలో సంగతులు, తన మదిలో భావాలు అందరితో పంచుకుంటానని స్పష్టం చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)