Breaking News

జులై 24న పది రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు

Published on Tue, 06/27/2023 - 21:27

న్యూడిల్లీ: జులై 24న రాజ్యసభకు ఎన్నికలు జరగనున్నాయి. కేంద్రమంత్రి ఎస్‌ జైశంకర్‌ సహా పది మంది సభ్యుల పదవీకాలం పూర్తవనుండటంతో జూలై 24న రాజ్యసభకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ ఏడాది జులై – ఆగస్ట్‌ మధ్య పశ్చిమ బెంగాల్‌, గోవా, గుజరాత్‌ నుంచి ఈ 10 స్థానాలు ఖాళీ అవుతున్నట్లు పేర్కొంది. 

కాగా అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్‌లో మూడు, గోవాలో ఒక స్థానం ఖాళీ కానుంది.  ఆయా స్థానాలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్‌ జులై 6న విడుదలవుతుందని తెలిపింది. జూలై 13 వరకు నామినేషన్లు స్వీకరణ, ఉపసంహరణకు జులై 17న చివరి తేదీగా పేర్కొంది. 24న  ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికల పోలింగ్‌ జరుగుతుందని, అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నట్లు వెల్లడించింది. 

పదవికాలం ముగియనున్న వారు..
►పశ్చిమ బెంగాల్‌లో డెరెక్ ఓబ్రియెన్, డోలా సేన్, ప్రదీప్ భట్టాచార్య, సుస్మితా దేవ్, శాంత ఛెత్రి, సుఖేందు శేఖర్ రాయ్‌ల పదవీకాలం ముగియనుంది.

►గుజరాత్‌ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న  విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌, దినేష్‌ జెమల్‌భాయ్‌ అనవాదియా, లోఖండ్‌వాలా జుగల్‌ సింగ్‌ మాథుర్‌జీల పదవీకాలం కూడా ముగియనుంది.

►గోవా నుంచి ఎంపీ వినయ్ డీ టెండూల్కర్‌

గత ఏడాది జులైలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ నాలుగు రాష్ట్రాల్లోని ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ మూడు స్థానాలను నిలబెట్టుకోగా, రాజస్థాన్‌, మహారాష్ట్రల్లో ఒక్కో స్థానంలో గెలుపొందింది. అదే విధంగా పశ్చిమ బెంగాల్‌లోని ఒక రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. గోవా మాజీ ముఖ్యమంత్రి లుజిన్హో ఫలేరో తన స్థానానికి, తృణమూల్ కాంగ్రెస్‌కు రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)