Breaking News

ఈడీ చార్జిషీట్‌లో ప్రియాంక పేరు

Published on Fri, 12/29/2023 - 04:54

న్యూఢిల్లీ:  ప్రవాస భారతీయుడు, వ్యాపారవేత్త సి.సి.థాంపీ నిందితుడుగా ఉన్న అక్రమ నగదు లావాదేవీల(మనీ లాండరింగ్‌) కేసులో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తమ చార్జి షీట్‌లో తొలిసారిగా ప్రస్తావించింది. అయితే, ఆమెను నిందితురాలిగా పేర్కొనలేదు. ఈ చార్జిషీట్‌ను గత నెలలో ఢిల్లీలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టులో ఈడీ సమరి్పంచింది. ఈ నెల 22న చార్జిషీట్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. తదుపరి విచారణను వచ్చే 29వ తేదీకి వాయిదా వేసింది. ఇదే కేసులో గతంలో సమర్పించిన చార్జిషీట్‌లో ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రా పేరును ఈడీ చేర్చింది.  

చార్జి్జషీట్‌లో ఏముందంటే..  
► కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్‌ వాద్రా 2005–06లో హెచ్‌.ఎల్‌.పహ్వా అనే ఢిల్లీ రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌ నుంచి హరియాణాలోని అమీపూర్‌లో 40.08 ఎకరాలు కొన్నాడు. అదే భూమిని 2010 డిసెంబర్‌లో పహా్వకు అమ్మేశాడు.  
►  ప్రియాంకాగాంధీ 2006 ఏప్రిల్‌లో పహ్వా నుంచి అమీపూర్‌లో 5 ఎకరాలు కొనుగోలు చేశారు. 2010 ఫిబ్రవరిలో ఆ భూమిని తిరిగి అతడికే విక్రయించారు.   
► పహ్వా సహాయంతో సి.సి.థాంపీ 2005 నుంచి 2008 మధ్య అమీపూర్‌లో 486 ఎకరాలు కొన్నాడు.  
► రాబర్ట్‌ వాద్రా, థాంపీ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇద్దరి మధ్య ఉమ్మడి, వ్యాపార ప్రయోజనాలు కూడా ఉన్నాయి.  
► రాబర్ట్‌ వాద్రాకు, థాంపీకి విక్రయించిన భూమికి గాను లెక్కలోని రాని నగదును పహ్వా స్వీకరించాడు.   
► థాంపీ 2020 జనవరిలో అరెస్టయ్యాడు. వాద్రా తనకు గత పదేళ్లుగా తెలుసని ఈడీ విచారణలో అంగీకరించాడు. దుబాయ్‌లో, ఢిల్లీలో పలుమార్లు కలుసుకున్నామని వెల్లడించాడు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)