Breaking News

మనీ లాండరింగ్‌ కేసులో... గుజరాత్‌ ఐఏఎస్‌ అధికారి అరెస్ట్‌

Published on Sat, 01/03/2026 - 06:11

అహ్మదాబాద్‌: లంచానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో గుజరాత్‌లో ఓ ఐఏఎస్‌ అధికారిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అరెస్ట్‌ చేసింది. 2015 బ్యాచ్‌ ఐఏఎస్‌ అయిన రాజేంద్ర కుమార్‌ పటేల్‌ సురేంద్రనగర్‌ కలెక్టర్‌గా పనిచేస్తుండగా వారం క్రితం హఠాత్తుగా ఎటువంటి పోస్ట్‌ ఇవ్వకుండానే ప్రభుత్వం బదిలీ ఉత్తర్వులు జారీ చేసింది. మోరి తదితరులపై నమోదైన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌(ఈసీఐఆర్‌) ఆధారంగా ఈడీ మనీలాండరింగ్‌ కేసు దర్యాప్తు చేస్తోంది. ఈడీ ఫిర్యాదు మేరకు గుజరాత్‌ ఏసీబీ వేరుగా పటేల్, ఆయన వ్యక్తిగత సహాయకుడు జయరాజ్‌ ఝాలా తదితరులపై కేసు నమోదు చేసింది. 

డిసెంబర్‌ 23వ తేదీన మోరీ ఇంట్లో ఈడీ సోదాలు జరపగా రూ.67.5 లక్షలు దొరికాయి. అదంతా లంచం సొత్తేనని విచారణలో మోరి అంగీకరించాడు. భూ వినియోగానికి సంబంధించిన దరఖాస్తులను త్వరితంగా పరిష్కరించినందుకు గాను లంచం తీసుకుంటున్నట్లు అతడు వెల్లడించాడు. దర్యాప్తు మరింత చేపట్టిన ఈడీ..ఈ మొత్తం వ్యవహారంలో కలెక్టర్‌ సహా ఆ కార్యాలయంలోని అధికారుల అందరి ప్రమేయం ఉన్నట్లు తేలి్చంది. వీరు భూమి చదరపు మీటర్‌ చొప్పున లెక్కకట్టి మరీ లంచం తీసుకుని లంచం తీసుకుంటున్నట్లు వెల్లడైంది. ఈ మేరకు శుక్రవారం ఈడీ బృదం రాజేంద్ర కుమార్‌ పటేల్‌ను అరెస్ట్‌ చేసింది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)