Breaking News

నడ్డా, ఖర్గేలకు ఈసీ లేఖ.. కీలక ఆదేశాలు

Published on Sat, 11/16/2024 - 18:28

ఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు పరస్పరం ఇటీవల ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఈసీ స్పందించింది. ఇరు పార్టీల అధ్యక్షులు జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గేలకు వేర్వేరుగా లేఖలు రాసింది.

కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ తన ప్రసంగంలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ ఈసీకి ఇటీవల బీజేపీ ఫిర్యాదు చేసింది. మరో వైపు.. కేంద్ర మంత్రి అమిత్‌ షా కూడా కోడ్‌ ఉల్లంఘించారంటూ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఫిర్యాదులపై ఈ నెల 18వ తేదీ(సోమవారం) మధ్యాహ్నం ఒంటిగంట లోపు అధికారికంగా వివరణ ఇవ్వాలంటూ ఆ పార్టీల అధ్యక్షులకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

ఇటీవల లోక్‌సభ ఎన్నికల సందర్భంగా జాతీయ పార్టీల స్టార్ క్యాంపెయినర్లకు చేసిన సూచనలను ఈసీ ప్రస్తావిస్తూ.. ఇతరులకు ఆదర్శంగా మెలగాలంటూ హితవు పలికింది. ఎన్నికల ప్రచార సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను కచ్చితంగా పాటించాల్సిందేనని ఎన్నికల సంఘం తాజాగా మరోసారి గుర్తు చేసింది.

ఇదీ చదవండి: జో బైడెన్‌లాగే ప్రధాని మోదీకి మతిపోయినట్లుంది: రాహుల్‌

Videos

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)