Breaking News

పార్లమెంట్‌కు ధర్మేంద్ర ప్రధాన్‌.. కారు దిగగానే!

Published on Mon, 07/27/2026 - 11:24

సాక్షి, న్యూఢిల్లీ: యువత నిరసలతో దిగొచ్చి ధర్మేంద్ర ప్రధాన్‌ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు కదా. ఇవాళ ఎంపీ హోదాలో ఆయన పార్లమెంట్‌ సమావేశాలకు కోసం వచ్చారు. అయితే ఆయన రాక సందర్భంగా పార్లమెంట్‌ ఆవరణలో నినాదాల పోరు కనిపించింది.

సోమవారం ఉదయం పార్లమెంట్‌కు వచ్చిన ధర్మేంద్ర ప్రధాన్‌ కారు దిగి దిగగానే ఎన్డీయే ఎంపీలు ఘన స్వాగతం పలికారు. ఆయనకు మద్దతుగా “ధర్మేంద్ర ప్రధాన్‌ జిందాబాద్‌” అంటూ నినాదాలు చేశారు. ఆయనను హీరోలా స్వాగతిస్తూ.. నెత్తిన టోపీ పెట్టి ఎన్డీయే ఎంపీలు సంఘీభావం ప్రకటించారు. ఫొటోలు కూడా దిగారు. అదే సమయంలో.. 

నీట్‌ పేపర్‌ లీకేజీ వ్యవహారం, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాను డిమాండ్‌ చేసిన ఇండియా కూటమి ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ నినాదాలతో పార్లమెంట్‌ ప్రాంగణం కొద్దిసేపు హోరెత్తింది. అయితే ఎన్డీయే ఎంపీలు అవేం పట్టనట్లు తమ పని తాము చేసుకుంటూ పోయారు. అలా.. ఒకేసారి డబుల్‌ వెల్‌కమ్‌ దక్కింది ఆయనకు. 

విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో నీట్‌ వ్యవహారంపై కేంద్రంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. 36 రోజుల తర్వాత నిరసనలు ఉధృతమైన నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్‌ తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను నైతిక బాధ్యత తీసుకున్న నిర్ణయంగా ఎన్డీయే నేతలు అభివర్ణిస్తున్నారు. అటు ప్రతిపక్షాలు మాత్రం నీట్‌ అవకతవకలకు ఆయన రాజీనామా చేయడం సరైందేనని అంటున్నాయి. 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)