Breaking News

దేశంలో తొలి ఆధార్‌ కార్డు ఎవరిదో తెలుసా?

Published on Thu, 11/27/2025 - 15:18

భారతదేశంలో మొట్టమొదటి ఆధార్ కార్డు హోల్డర్ ఎవరు. ఆమె వంట గ్యాస్, టాయిలెట్ లేదా విద్యుత్  సౌకర్యాలు కూడా లేకుండా జీవిస్తుండటం ఆసక్తికరం.  పదండి మరి ఆమె ఎవరో? ఎక్కిడి వారో వివరాలు తెలుసుకుందాం.

భారతదేశంలో  తొలి ఆధార్ కార్డు పొందిన వ్యక్తి మహారాష్ట్రలోని నందూర్బార్ జిల్లాలోని టెంబ్లి గ్రామ నివాసి. ఆధార్ కార్డు మహిళగా ప్రసిద్ధి చెందిన రంజనా సోనావానే.  2010న సెప్టెంబర్ 29,అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ హాజరైన ఆధార్ కార్యక్రమం జాతీయ ప్రారంభోత్సవంలో ఈ కార్డు జారీ చేశారు. ఆధార్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభించడానికి ఈ గ్రామాన్ని ఎంచుకున్నారు.

చదవండి: డీకేకి చాన్స్‌ ఇస్తే.. సిద్ధరామయ్య ప్లాన్‌ ఏంటి?

ఎవరీ రంజన సోనావానే?
మహారాష్ట్రలోని మారుమూల గ్రామంలో ఒక పూరిగుడిసెలో నివసించే మహిళ రంజనా. ఆమె భర్త సదాశివ్  దినసరి కూలీ.వీరికి ముగ్గురు పిల్లలు. ప్రత్యేక గుర్తింపు కార్డు పొందిన  తొలి వ్యక్తి అయినప్పటికీ, వంట గ్యాస్, టాయిలెట్‌, విద్యుత్తు లాంటి కనీస సౌకర్యాలేవీ లేవు.  అందుకే  తొలి ఆధార్‌ కార్డు  పొండదంలో గొప్ప  ఏముంది? ఇదో గొప్ప విజయమా. లాటరీ గెలిచనట్టుగా కాదు కదా అని అప్పట్లోనే తన నిర్లిప్తతతను ప్రకటించింది. తమలాంటి పేదవాళ్లు, గిరిజనుల కోసం ఏ మీ చేయాలేదు, ఓట్లు మాత్రం అడుగుతారు అంటూ అప్పటి మంత్రులపై నిరసనను  సోనావానే ఒక ఇంటర్వ్యూలో  ప్రకటించింది.  

ఇదీ చదవండి: ఆధార్‌ ఉన్నంత మాత్రాన ఓటు హక్కు ఇవ్వాలా ? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ప్రభుత్వ సబ్సిడీలు, సంక్షేమ పథకాలకు ప్రాప్యతకు అంత్యంత  కీలకమైన  ఈ కార్డు ద్వారా తనకు ఒరిగిందేమీ లేదని ఒక సందర్భంలో వాపోయింది. ఆధార్ కార్డు తనకు ఉద్యోగం పొందడానికి సహాయ పడుతుందని మొదట్లో భావించానని, కానీ తర్వాత తాను పొరబడ్డానని గ్రహించానని కూడా చెప్పింది. ఆధార్ కార్డు పొందిన తొలి భారతీయురాలిగా పదిహేను సంవత్సరాలు గడిచినా, 54 ఏళ్ల రంజనా సోనావానే తనకు ప్రభుత్వపరంగా ఉద్దేశించిన ప్రాథమిక సంక్షేమ ఫలాలేవీ  అందలేదని తెలిపింది.  

ఇదీ చదవండి : స్మృతి మంధాన పెళ్లి వాయిదా : మరో వార్త వైరల్‌

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)