Breaking News

Air India: 48 గంటల్లో 9 ఘటనలు.. డీజీసీఏ సీరియస్‌

Published on Tue, 06/17/2025 - 15:49

న్యూఢిల్లీ: ఎయిరిండియా విమానయాన సంస్థపై డైరెక్టరేట్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(DGCA) చర్యలకు ఉపక్రమించింది. వరుసగా ఎయిర్‌క్రాఫ్ట్‌లలో సాంకేతిక లోపాలు బయటపడడం, విమానాలు రద్దు కావడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో మంగళవారం ఎయిరిండియాతో వర్చువల్‌ సమావేశం నిర్వహించింది.

అహ్మదాబాద్‌ ఎయిరిండియా విమాన ప్రమాదం దృష్ట్యా డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అన్ని బోయింగ్ 787 విమానాల్లో భద్రతా తనిఖీలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని ఎయిర్ ఇండియాకు రెండు వారాల గడువు విధిస్తూ డీజీసీఏ ఆదేశాలు ఇచ్చింది కూడా. అయితే.. 

ఈలోపే వరుసగా సాంకేతిక లోపాలతో ఘటనలు వెలుగులోకి వస్తుండడంతో డీజీసీఏ అప్రమత్తమైంది. గత 48 గంటల్లో 9 ఘటనలు చోటు చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఈ క్రమంలోనే మంగళవారం ఎయిరిండియా ప్రతినిధులతో వర్చువల్‌ సమావేశం నిర్వహించింది. బోయింగ్‌ విమానాల్లో సాంకేతిక సమస్యలపై ప్రశ్నలు సంధిస్తూ.. ఎయిరిండియా ఇంజనీరింగ్‌ చీఫ్‌కు డీజీసీఏ సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. 

మంగళవారం ఒకేరోజు ఎయిరిండియాకు చెందిన మూడు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దుయ్యాయి. శాన్‌ఫ్రాన్సిస్కో-ముంబై, అహ్మదాబాద్‌-లండన్‌ సర్వీస్‌ రద్దు కాగా తాజాగా ఢిల్లీ-ప్యారిస్‌ సర్వీస్‌ కూడా రద్దు అయినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: అదే రూట్‌.. సాంకేతిక సమస్యతో మళ్లీ రద్దు

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)