Breaking News

దొంగను పట్టించిన శివుని టాటూ.. ఎంపీ సుధకు ఊరట

Published on Thu, 08/07/2025 - 11:56

న్యూఢిల్లీ: లోక్‌సభ మహిళా ఎంపీ గొలుసును చోరీ చేసిన దొంగను పోలీసులు 48 గంటల్లో పట్టుకున్నారు. ఇందుకు శివుని టాటూ వారికి ఉపయోగపడింది. ఓఖ్లా ఇండస్ట్రియల్ ఏరియాకు చెందిన సోహన్ రావత్ (60) ఈ చోరీకి పాల్పలడినట్లు పోలీసులు గుర్తించారు. సోహన్‌పై గతంలో26 దోపిడీ, దొంగతనం కేసులున్నాయి. వాహన దొంగతనం కేసులో సోహన్ బెయిల్‌పై బయటకు వచ్చాడు.

ఎంపీ సుధ గొలుసు చోరీ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఐదువేలకు పైగా సీటీవీ కెమెరాలను పరిశీలించారు.48 గంటల ఇంటెన్సివ్ ఆపరేషన్ తర్వాత, పోలాండ్ రాయబార కార్యాలయం సమీపంలో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సదరన్ రేంజ్) సంజయ్ కుమార్ జైన్ మాట్లాడుతూ ఉదయం 6 గంటల ప్రాంతంలో బీఆర్‌టీ కారిడార్ సమీపంలో  బంగారు గొలుసును పారవేసేందుకు ప్రయత్నిస్తుండగా రావత్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు.

నిందితుడు సోహన్ రావత్  ఈ నేరానికి ఉపయోగించిన స్కూటర్, నాలుగు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని గుర్తించడంలో అతని శరీరంపైనున్న టాటూ ఉపయోగపడింది. దీనిగురించి అతని బంధువులు పోలీసులకు సమాచార మిచ్చారు. అతని భార్య పోలీసులకు రావత్‌ మొబైల్ నంబర్‌ను అందించింది. ఫలితంగా రావత్‌ పోలీసులకు చిక్కాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)