Breaking News

ఢిల్లీ పేలుడు కేసు: విదేశీ డిగ్రీ వైద్యులపై నిఘా!

Published on Sat, 11/29/2025 - 12:44

న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన పేలుడుపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులు విదేశీ డిగ్రీ కలిగిన వైద్యులపై నిఘా సారించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), చైనా నుంచి ఎంబీబీఎస్ డిగ్రీలు పొంది, ఢిల్లీలో ప్రాక్టీస్ చేస్తున్న వైద్యుల వివరాలను అందించాలంటూ ఢిల్లీ పోలీసులు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశారు.

ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి జారీ చేసిన నోటీసులో ‘ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు దర్యాప్తును దృష్టిలో ఉంచుకుని, పాకిస్తాన్, బంగ్లాదేశ్, యూఎఈ, చైనా నుండి డిగ్రీ పొందిన వైద్యులు మీ ఆసుపత్రిలో ఉంటే, వారి వివరాలను అందించండి. దీనిని అత్యవసరమైనదిగా పరిగణించండి’ అని ఆ నోటీసులో పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అల్ ఫలా విశ్వవిద్యాలయంలో తమ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఢిల్లీ పేలుడుకు సంబంధించి విశ్వవిద్యాలయంలోని 30 మంది వైద్యుల వాంగ్మూలాలను నమోదు చేశారు. ఈ వైద్యులను.. ఉమర్ ప్రవర్తన గురించి ప్రశ్నించారు. తోటి వైద్యులు ఉమర్ ప్రవర్తన దురుసుగా ఉండేదని, కొంతమందిని మాత్రమే తన గదిలోకి అనుమతించేవాడని వెల్లడించారు.

ఉమర్ ఉపయోగించిన ఫోన్లలో ఒకటి జమ్ముకశ్మీర్ పోలీసుల దగ్గరుంది. దర్యాప్తు సంస్థ ఈ ఫోన్‌లో నాలుగు వీడియోలను కనుగొంది. వాటిలో ఒకటి ఇప్పటికే బహిరంగపరిచారు. అందులో ఉమర్.. జిహాద్‌తో పాటు మానవ బాంబులను సమర్థించాడు. మిగిలిన మూడు వీడియోలు కూడా ఉమర్ చిత్రీకరించనవే. ఒక్కొక్కటి మూడు నుండి ఐదు నిమిషాల వ్యవధితో ఉన్నాయి. ఉమర్‌ ఫోన్ సాయంతో దర్యాప్తు సంస్థ అతని సహచరులను, నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకూ జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాద మాడ్యూల్‌తో సంబంధం ఉన్న డాక్టర్ ముజమ్మిల్ షకీల్ గనాయ్, డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్, ముఫ్తీ ఇర్ఫాన్ అహ్మద్ వాగే (జమ్ముకశ్మీర్),  డాక్టర్ షాహీన్ సయీద్ (ఉత్తరప్రదేశ్)లను అరెస్టు చేశారు.

ఇది కూడా చదవండి: శ్రీలంకకు ‘ఆపరేషన్ సాగర్ బంధు’

Videos

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)