Breaking News

Delhi: నేడు కృత్రిమ వర్షం.. కురిపిస్తారిలా.. ప్రయోజనమిదే..

Published on Tue, 10/28/2025 - 10:48

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో కాలుష్యం పెను స‌మ‌స్య‌గా మారింది. దీనికి చెక్ పెట్టేందుకు ఢిల్లీ ప్ర‌భుత్వం కృత్రిమంగా వ‌ర్షాలను కురిపించేందుకు సిద్ధ‌మ‌య్యింది. శీతాకాలంలో క్షీణిస్తున్న గాలి నాణ్యతను తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీపావళి అనంతరం పొగ, దుమ్ము, పొగమంచు కలగలిసి ఢిల్లీని గ్యాస్ చాంబర్‌ మాదిరిగా మార్చాయి. దీనికి క్లౌడ్ సీడింగ్ (కృత్రిమ వర్షాలు) పరిష్కారం చూపనుంది.

వాతావరణం అనుకూలిస్తే..
వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఢిల్లీ ప్రభుత్వం నేడు (మంగళవారం)తొలి క్లౌడ్ సీడింగ్ ట్రయల్‌ను నిర్వహించనుందని సంబంధిత అధికారి తెలిపారు. ఈ పరీక్షను నిర్వహించే ముందు సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా మీడియా సంస్థ పీటిఐకి తెలిపారు. ఈ ప్రయోగానికి ఉపకరించే విమానం  కాన్పూర్ నుండి ఢిల్లీకి చేరుకుంటుందని, వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే క్లౌడ్ సీడింగ్ ట్రయల్ నిర్వహిస్తామన్నారు. క్లౌడ్ సీడింగ్ ప్రయోగానికి సన్నాహాలు ఇప్పుటికే పూర్తయ్యాయి.

రూ.3.21 కోట్ల వ్యయం
ప్రభుత్వం  ఇటీవల బురారి మీదుగా ఒక టెస్ట్ ఫ్లైట్ నిర్వహించిందని, టెస్ట్ రన్ సమయంలో కృత్రిమ వర్షపాతాన్ని ప్రేరేపించేందుకు ఉపయోగించే చిన్న పరిమాణంలో సిల్వర్ అయోడైడ్, సోడియం క్లోరైడ్ సమ్మేళనాలను విమానం నుండి విడుదల చేశామని సంబంధిత అధికారులు తెలిపారు. వాయువ్య ఢిల్లీలో ఐదు క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ నిర్వహించడానికి ఢిల్లీ ప్రభుత్వం సెప్టెంబర్ 25న ఐఐటీ, కాన్పూర్‌తో ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయూ)కుదుర్చుకుంది. దీనికి ముందు ఢిల్లీ క్యాబినెట్ మే 7న రూ.3.21 కోట్ల వ్యయంతో ఐదు క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ నిర్వహించాలనే ప్రతిపాదనను ఆమోదించింది.

క్లౌడ్ సీడింగ్ అంటే..
క్లౌడ్ సీడింగ్(కృత్రిమ వర్షం) అంటే మేఘాలలో రసాయనాలను విడుదల చేసి,  వర్షం కురిసేలా చేసే విధానం . ఇందుకోసం సాధారణంగా సిల్వర్ అయోడైడ్ లేదా సోడియం క్లోరైడ్ లాంటి రసాయనాలు వాడుతారు. మేఘాలు తగినంతగా ఉన్న సమయంలో ఈ రసాయనాలను వాటిలోకి చిమ్మి, నీటి బిందువులు ఏర్పడేలా చేస్తారు. దాంతో మేఘాలు వర్షం కురిపిస్తాయి. ఈ ఆపరేషన్ కోసం సెస్నా అనే చిన్న విమానాన్ని ఎంచుకున్నారు. ఇది శాస్త్రీయ ప్రయోగాలకు, తక్కువ ఎత్తులో ఎగరడానికి, కచ్చితమైన నియంత్రణ సామర్థ్యాలను కలిగివుంటుంది. ఈ విమానాన్ని ప్రత్యేకంగా క్లౌడ్ సీడింగ్‌కు ఉపయోగపడే విధంగా మార్పులు చేశారు.

ఉపయోగాలివే..
కృత్రిమ వర్షం  కారణంగా గాలిలే తేలియాడే కాలుష్య కణాలు కిందికి చేరతాయి. ఫలితంగా గాలి శుభ్రపడి, ఆక్సిజన్ స్థాయి మెరుగుపడుతుంది. ఇది తాత్కాలిక పరిష్కారంగా కనిపించినప్పటికీ, కాలుష్యం అధికంగా ఉన్న సమయంలో ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఈ ప్రయోగానికి వాతావరణం అనుకూలించడం అత్యవసరం.  సెస్నా విమానంతో చేసే ఈ ప్రయోగం  విజయవంతమైతే, భవిష్యత్తులో ఇతర నగరాల్లో కూడా ఇదే తరహాలో కృత్రిమ వర్షాలు కురిపించేందుకు అవకాశం ఏర్పడుతుంది.  

ఇది కూడా చదవండి: మరో నగరం పేరు మార్పు.. ముస్తఫాబాద్ ఇకపై..

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)