Breaking News

మనీష్‌ సిసోడియాకు కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ

Published on Fri, 03/31/2023 - 17:02

న్యూఢిల్లీ: ఆప్ సీనియ‌ర్ నేత‌, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాకు కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో సిసోడియాకు బెయిల్‌ ఇచ్చేందుకు ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ఈ మేరకు ఆప్‌ నేత బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ ప్రత్యేక న్యాయమూర్తి ఎంకె నాగ్‌పాల్ శుక్రవారం తీర్పు వెలువరించారు. కాగా లిక్కర్‌ పాలసీ కేసులో సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లో అరెస్ట్‌ అయిన సిసోడియా  ప్రస్తుతం తీహార్‌ జైల్లో జ్యూడిషియల్‌ కస్టడీలో ఉన్నారు.

2021-22 సంవత్సరానికి సంబంధించి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అమలులో అవినీతి జరిగిందని ఆరోపించిన సీబీఐ.. ఎనిమిది గంటలపాటు సిసోడియాను విచారించిన అంనంతరం ఫిబ్రవరి 26న ఆయన్ను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఆప్‌ సీనియర్‌ నేత విచారణకు సహకరించడం లేదని, అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదంటూ అదుపులోకి తీసుకుంది. సీబీఐ అధికారులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో అతడి పేరును నిందితుల జాబితాలో చేర్చారు.

అంతకుముందు సిసోడియా తన బెయిల్‌ పిటిషన్‌లో సీబీఐ విచారణకు హాజరువుతున్నానని, భవిష్యత్తులో కూడా సహకరిస్తానని తెలిపారు. ఈ కేసులోని మరో నిందితుడికి ఇప్పటికే బెయిల్‌ మంజూరు అయ్యిందని గుర్తుచేశారు. అంతేగాక ఈ కేసులో ఇప్పటికే అన్ని రికవరీలు జరిగాయని, ఈ క్రమంలో ఇంకా తాను  కస్టడీలో ఉండటానికి ఎలాంటి ప్రయోజనకర ఉద్దేశ్యం లేదని తెలిపారు.
చదవండి: ప్రధాని మోదీ ‘డిగ్రీ’ చూపించాల్సిన అవసరం లేదు: హైకోర్టు

అయితే ఆప్‌ నేత బెయిల్ పిటిషన్‌ను సీబీఐ వ్యతిరేకించింది. సీబీఐ తరపున డీపీ సింగ్‌ వాదనలు వినిపించారు. అతనికి బెయిల్ మంజూరు చేయడం దర్యాప్తును దెబ్బతీస్తుందని, సిసోడియా సాక్ష్యాలను నాశనం చేసే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు, సిసోడియా తరఫున సీనియర్ న్యాయవాది దయన్ కృష్ణన్ కోర్టుకు తన వాదనలు వినిపిస్తూ.. తాము సెక్షన్ 41A CrPC నోటీసులకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.

కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరం లేదని తాము ఆ దశను దాటేశామని పేర్కొన్నారు. కస్టడీని కంటిన్యూ చేయడానికి సీబీఐ బలవంతమైన కారణం ఏం పేర్కొనలేదని.. సిసోడియా సాక్షులను బెదిరించగలరని రికార్డుల్లో ఎక్కడ లేదని కోర్టుకు విన్నపించారు. ఇరు వాదనలు విన్న కోర్టు ఈనెల 24వ తేదీన సిసిడియా బెయిల్ అభ్యర్థనపై తీర్పును రిజర్వ్‌ చేసిన కోర్టు.. నేడు తీర్పు వెలువరించింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)