Breaking News

ఢిల్లీ పేలుడు: దీపావళికే ప్లాన్‌?

Published on Wed, 11/12/2025 - 11:04

న్యూఢిల్లీ: ఢిల్లీలో జరిగిన కారు పేలుడు యావత్‌ దేశాన్ని భయాందోళనలోకి నెట్టివేసింది. ఈ ఘటనలో  తొమ్మిది మంది మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. ఈ కేసుపై దర్యాప్తు బృందాలు అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో నిఘా వర్గాల నుంచి ఒక కీలక సమాచారం వెల్లడయ్యింది.

ఢిల్లీ పేలుళ్ల కేసులో కీలక నిందితుడు ముజమ్మిల్  దర్యాప్తు అధికారుల విచారణలో.. తాను, ఉమర్‌.. ఎర్రకోట ప్రాంతానికి పేలుడు జరగడానికి ముందుగా చేరుకున్నామని చెప్పాడు. వచ్చే ఏడాది జనవరి 26న దాడి చేసేందుకు ప్రణాళిక ఉందని, దానిలో భాగంగా ఎర్రకోట చుట్టుపక్కల ప్రాంతాన్ని గుర్తించామని ముజమ్మిల్ తెలిపాడు. అదేవిధంగా మొన్నటి దీపావళికి రద్దీగా ఉండే ప్రాంతంలో దాడి చేయాలని తాము ముందుగా ప్లాన్ చేశామని, అయితే దానిని అమలు చేయలేకపోయామని ముజమ్మిల్ విచారణ అధికారులకు తెలిపినట్లు ‘ఎన్డీటీవీ’ తన కథనంలో పేర్కొంది.

ఎర్రకోట సమీపంలో పేలుడు జరిగిన దరిమిలా దర్యాప్తు బృందం కీలక నిందితుడు డాక్టర్‌ ముజమ్మిల్‌ను విచారిస్తున్నారు. ఇతను ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. ఇతని సహోద్యోగి ఉమర్ ఎర్రకోట మెట్రో స్టేషన్  ట్రాఫిక్ సిగ్నల్ సమీపంలో కారు పేలి మరణించినట్లు భావిస్తున్నారు. మూలాల ప్రకారం ముజమ్మిల్‌ను విచారిస్తున్న పోలీసులు అతని ఫోన్ డేటాను స్వాధీనం చేసుకున్నారని సమాచారం.

ఇది కూడా చదవండి: ఢిల్లీ పేలుడు: అంత్యక్రియల్లో అత్తాకోడళ్ల వివాదం

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)