Breaking News

‘తన బిడ్డకు హాని జరిగితేనే అసీం మునీర్‌కు మా బాధ అర్థమవుతుంది’

Published on Fri, 07/18/2025 - 17:53

సాక్షి,న్యూఢిల్లీ: మేం పడుతున్న బాధ ఎలా ఉంటుందో ఆసిమ్‌ మునీర్‌కు ఇప్పుడు అర్ధం కాదు. తన బిడ్డలకు ఏదైనా హాని జరిగితే అప్పుడు అర్ధమవుతుంది. ఈ మాటలన్నది మరెవరో కాదు. పహల్గాంలో లష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్‌ఎఫ్‌(The Resistance Front)ఉగ్రవాదులు ప్రదర్శించిన అంతులేని ఉన్మాదంలో కోల్పోయిన తొలి ప్రాణం లెఫ్టినెంట్‌ వినయ్‌ నార్వాల్‌ (26)తండ్రి రాజేష్‌

ఈ ఏడాది ఏప్రిల్‌ 22న ప్రకృతి అందాలతో అలరారే పచ్చిక బయళ్లపై  ముష్కరులు సృష్టించిన  నరమేధంలో 26మంది టూరిస్టులు మరణించగా.. వారిలో లెఫ్టినెంట్‌ వినయ్‌ నార్వాల్‌ ఒకరు.

ఏప్రిల్ 16న వివాహం చేసుకున్న 26 ఏళ్ల లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్..కేవలం ఆరు రోజుల్లోనే జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆ దుర్ఘటన జరిగిన సమయంలో ఆయన భార్య హిమాన్షీ నర్వాల్.  భర్త పార్థివ దేహం పక్కన కూర్చుని  రోదిస్తున్న దశ్యాలు దేశ ప్రజల్ని కంటతడి పెట్టించాయి.ఈ దారుణ ఘటన దేశ ప్రజల్ని తీవ్రంగా కలిచివేసింది.

అయితే,పహల్గాంలో మారణ హోమం సృష్టించిన టీఆర్‌ఎఫ్‌పై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. పహల్గాం దాడికి బాధ్యత వహించిన టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.

అమెరికా ప్రకటనపై లెఫ్టినెంట్ నర్వాల్ తండ్రి రాజేష్ నర్వాల్ మీడియాతో మాట్లాడారు.ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన తన కుమారుడు వినయ్‌ నార్వాల్‌ను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతరమయ్యారు. పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసీం మునీర్‌ కుమారుడు,కుమార్తెకు ఏదైనా హాని జరిగితే.. మేం పడుతున్న బాధ అర్థమవుతుంది.

నా కొడుకు మరణంతో కుటుంబం మొత్తం మానసికంగా కృంగిపోయింది. నిద్రలేని రాత్రులు, మానసిక సమస్యలు వెంటాడుతున్నాయి. మానసికంగా అలసిపోయాం. రెండు మూడు గంటలకంటే ఎక్కువ నిద్రపోవడం లేదన్నారు..ఏదో బ్రతుకుతున్నాం అంటే బ్రతుకుతున్నాం’ అంటూ  నిట్టూర్చారు. 

కాగా,పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌పై భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ను చేపట్టింది. భారత్‌ చేపట్టిన ఈ ఆపరేషన్‌లో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫ్ఫరాబాద్, కోట్లి,బహావల్పూర్,రావలకోట్,చక్స్వారీ, భింబర్,నీలం వ్యాలీ,జెహ్లం చక్వాలపై దాడులు చేపట్టింది. ఈ దాడులతో పాక్‌ ఆర్ధికంగా,భారీ సంఖ్యలో ఉగ్రవాదులను కోల్పోయింది.  

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు