Breaking News

పెళ్లి డబ్బులకు కిడ్నాప్‌ డ్రామా.. రూ. 10 లక్షల కోసం తండ్రికి వీడియో బెదిరింపు

Published on Mon, 08/07/2023 - 11:26

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రెండు రోజుల క్రితం కిడ్నాప్‌ అయిన విద్యార్థిని ఉదంతంలో అసలు నిజం వెలుగు చూసింది. నిజానికి ఆ యువతి కిడ్నాప్‌కు గురి కాలేదని తేలింది. ఆమె డబ్బుల కోసం స్వయంగా ఫేక్‌ కిడ్నాప్‌ డ్రామా ఆడిందని వెల్లడయ్యింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం విద్యార్థి హన్సికా వర్మ ఇంజినీరింగ్‌ ఎంట్రన్‌ పాసయ్యింది. అడ్మిషన్‌ కోసం ఆమె రూర్కీలోని ఇంజినీరింగ్‌ కాలేజీకి వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే ఆమె ఇంటి నుంచి మాయమయ్యింది. 

రూ. 10 లక్షలు డిమాండ్‌
తరువాత ఆమె తండ్రి మొబైల్‌ ఫోనుకు ఒక వాట్సాప్‌ వీడియో మెసేజ్‌ వచ్చింది. దానిలో హన్సిక తాళ్లతో బందీగా కనిపిస్తోంది. ఈ వీడియోను పంపిన ఆగంతకులు హన్సిక తండ్రిని రూ. 10 లక్షలు డిమాండ్‌ చేశారు. అయితే హన్నిక తండ్రి ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేశారు. తక్షణం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే ఈ కిడ్నాప్‌ డ్రామా వెనుక అసలు సంగతి వెల్లడి కావడంతో అంతా ఆశ్చర్యపోయారు. 

హన్సిక తన ప్రియుడిని రహస్యంగా ప్రేమ వివాహం చేసుకునేందుకే ఈ డ్రామా ఆడిందని పోలీసుల దర్యా​ప్తుల్లో వెల్లడయ్యింది. ఆమె దగ్గర డబ్బులు లేకపోవడంతో ఆ ప్రేమ జంట ఫేక్‌ కిడ్నాపింగ్‌కు ప్లాన్‌ చేశారు. దాని ప్రకారమే హన్నిక ఒక బెదిరింపు వీడియోను తండ్రికి పంపించి, డబ్బులు డిమాండ్‌ చేసింది. 

పెళ్లికి దారితీసిన ఇన్‌స్టాగ్రామ్‌ ప్రేమ
కాన్పూర్‌ జాయింట్‌ పొలీస్‌ కమిషనర్‌ ఆనంద్‌ ప్రకాష్‌ తివారీ ఆధ్వర్యంలో హన్సికను ఆమె ప్రియుడు రాజ్‌ సింగ్‌ను అరెస్టు చేశారు. వారి నుంచి వారికి సంబంధించిన మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హన్నిక, రాజ్‌లు మే 22న వివాహం చేసుకుని, దానిని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని వెల్లడయ్యింది. ఈ ఉదంతంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వారిద్దరికీ పరిచయం అయ్యిందని, అది ప్రేమకు,తరువాత పెళ్లికి దారితీసిందని పోలీసులు తెలిపారు. అయితే ప్రస్తుతం పోలీసులు ఆ సర్టిఫికెట్‌ నిజమైనదో కాదో తేల్చేపనిలో ఉన్నారు.
ఇది కూడా చదవండి: ఆ భారీ షాపింగ్‌ మాల్‌లో కనిపించని క్యాషియర్‌.. మరి పేమెంట్‌ ఎలాగంటే..

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)