Breaking News

స్కిన్‌ కేర్‌పై క్రికెటర్‌ ప్రశ్న, ప్రధాని మోదీ సమాధానం ఏంటో తెలుసా?

Published on Thu, 11/06/2025 - 12:34

న్యూఢిల్లీ: భారత ఐసీసీ మహిళల ప్రపంచ కప్ విజేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశం అయ్యారు.  భారత్‌కు ఘన విజయాన్ని అందించిన  కెప్టెన్‌ హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని జట్టు సభ్యులను  ప్రధాని అభినందించారు. అలాగే టోర్నమెంట్ ఆరంభంలో ఎదురైన ఎదురుదెబ్బలు, ఆన్‌లైన్ ట్రోలింగ్‌ల గురించి ప్రస్తావిస్తూ, వాటన్నింటినీ  తట్టుకుని నిలబడి అద్భుతమైన విజయాన్ని అందించారంటూ వారిని మోదీ ప్రశంసించారు.

అయితే  ఈ ఉత్సాహభరితమైన సంభాషణల మధ్యలో  క్రికెటర్ హర్లీన్ కౌర్ డియోల్  మోదీని అడిగిన ప్రశ్న నెట్టింట ఆసక్తికరంగా మారింది. తన రహస్య చర్మ సంరక్షణ దినచర్య గురించి ప్రధాని మోదీని  ఆమె ప్రశ్నించింది. దీనికి  ప్రధాని ఏమి సమాధానం ఇచ్చారో  తెలుసా?  (ఇన్‌ఫ్లూయెన్సర్‌ హఠాన్మరణం : షాక్‌లో ఫ్యాన్స్‌)

 ఇంత  షైనీగా, యవ్వనంగా కనిపించే ఆయన   చర్మ సౌందర్య వెనుక సీక్రెట్‌  ఏంటి అంటూ  స్టార్ బ్యాటర్ ప్రధాని మోదీని అడిగింది. దానికి ప్రధాని చిరునవ్వుతో స్పందిస్తూ, చర్మ సంరక్షణ లేదా వస్త్రధారణపై తాను ఎప్పుడూ పెద్దగా శ్రద్ధ చూపలేదన్నారు. ప్రత్యేకంగా ఏమీ చేయను. దాదాపు  పాతికేళ్లుగా  ప్రభుత్వ పాలనలో మునిగి ఉన్నా, ప్రజల ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలే శాశ్వత ప్రభావాన్ని చూపుతాయని నమ్ముతానని చెప్పారు. దీంతో అక్కడంతా అభిమానంతో చప్పట్లు మారుమోగాయి. నవ్వులు విరబూశాయి.  (మమ్దానీ లవ్‌ స్టోరీ : ఎవరీ ‘మోడ్రన్‌ యువరాణి డయానా’)

అలాగే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 2017లో రన్నరప్‌గా నిలిచిన తర్వాత ప్రధాని మోదీని కలిసిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ ట్రోఫీతో వచ్చినందున ప్రత్యేకంగా అనిపించిందన్నారు. "భవిష్యత్తులో మరిన్ని ట్రోఫీలతో మిమ్మల్ని కలుస్తూనే ఉండాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేవారు. ప్రధాన మంత్రి మోదీ ప్రోత్సాహం తమకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిచ్చిందని, ఆయన స్థిరమైన మద్దతు, సాధికారత చొరవ కారణంగా దేశవ్యాప్తంగా మహిళలు వివిధ రంగాలలో రాణిస్తున్నారని వైస్-కెప్టెన్ స్మృతి మంధాన ప్రశంసించారు. మహిళా క్రికెట్‌ టీం గురువారం  దేశ అధ్యక్షురాలు ద్రౌపది ముర్మును కలవనున్నారు.

ఇదీ చదవండి: ఘనంగా బిర్లా వారసుడి పెళ్లి, సెలబ్రిటీల సందడి


 

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)