Breaking News

సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్షకు సీపీఎం మద్దతు

Published on Mon, 07/13/2026 - 16:57

సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య విలువలు పూర్తిగా లేకుండా పోయాయని సీపీఏం కార్యదర్శి శ్రీనివాస్ రావు అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై  అక్రమ కేసులు పెట్టి నిర్బంధిస్తున్నారన్నారు. ఈ రోజు (సోమవారం) పర్యావరణకారుడు సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్షకు  సీపీఎం ఏపీ కార్యదర్శి శ్రీనివాసరావు, తెలంగాణ జాన్ వెస్లీ మద్దతు ప్రకటించారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ నీట్ పరీక్ష తర్వాత పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని నీట్ పరీక్ష లీక్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం దేశంలోని యువతరమంతా ఆగ్రహంతో ఉందన్నారు. జాన్‌వెస్లీ మాట్లాడుతూ నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడం వల్ల లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటుందని తెలిపారు. సీజేపీ దీక్షకు సీపీఏం పూర్తి మద్దతిస్తోందని పేర్కొన్నారు. సీజేపీ ఆందోళనకు సీపీఎం పూర్తిగా మద్దతిస్తుందని స్పష్టం చేశారు.

ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జూన్ 28 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. నీట్‌ (NEET) సహా పోటీ పరీక్షల్లో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అదేవిధంగా లద్దాక్  ప్రత్యేక డిమాండ్ల వెంటనే నెరవేర్చాలని దీక్షకు దిగారు.

గత 15 రోజులుగా ఆయన దీక్ష చేయడంతో వాంగ్‌చుక్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. ఆహరం తీసుకోకపోవడంతో ఆయన రక్తపోటు (బీపీ), బ్లడ్ షుగర్ స్థాయిలు పడిపోయాయి.మొత్తంగా ఆయన 7.8 కిలోల బరువు తగ్గారు. దీంతో ఆయన ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)