Breaking News

Covid-19 Returns: 257 కేసులు.. ఇద్దరు మృతి

Published on Tue, 05/20/2025 - 13:00

న్యూఢిల్లీ: కోవిడ్-19 మరోమారు విజృంభిస్తోంది. ఆసియాలోని కొన్ని ప్రాంతాలలో కోవిడ్-19(COVID-19) కేసులు నమోదవుతున్నాయి. సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్ తదితర దేశాలలో కరోనా కేసులు(Corona cases) అంతకంతకూ పెరుగుతున్నాయి. ఓమిక్రాన్ ఉప-వేరియంట్లయిన జేఎన్‌-1, ఎల్‌ఎఫ్‌.7, ఎన్‌బీ.1.8 కేసుల పెరుగుదలకు కారణంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో 57 యాక్టివ్ కోవిడ్‌-19 కేసులు ఉన్నాయి. వీటిలోని అధికశాతం తేలికపాటివిగా, ఆసుపత్రి సంరక్షణ అవసరం లేనివిగా ఉన్నాయి.

ప్రభుత్వం అందించిన డేటాలోని వివరాల ప్రకారం మే 12 తరువాత కేరళలో అత్యధిక సంఖ్యలో మొత్తం 69 కేసులు నమోదయ్యాయి. దాని తర్వాత మహారాష్ట్రలో 44 కేసులు, తమిళనాడులో 34 కేసులు నమోదయ్యాయి.  అలాగే కర్ణాటకలో ఎనిమిది, గుజరాత్‌లో ఆరు, ఢిల్లీలో మూడు, హర్యానా, రాజస్థాన్, సిక్కింలలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయి. కాగా మహారాష్ట్ర(Maharashtra)లోని ముంబైలో గల కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ (కేఈఎం) ఆస్పత్రిలో కోవిడ్-19తో ఇద్దరు  మృతిచెందారు. హిందూస్తాన్ టైమ్స్ నివేదిక ప్రకారం ఈ ఇద్దరు రోగులకు తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయని వైద్యులు  పేర్కొన్నారు.

వీరిలో ఒకరు నెఫ్రోటిక్ సిండ్రోమ్ కారణంగా మూత్రపిండాలు దెబ్బతిన్న 14 ఏళ్ల బాలుడని, మరొకరు 54 ఏళ్ల క్యాన్సర్ రోగి అని వైద్యులు తెలిపారు. కాగా దేశ జనాభాలో రోగనిరోధక శక్తి తగ్గిన కారణంగా కేసులు పెరిగే  అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విజృంభిస్తున్న జేఎన్‌ వేరియంట్ లక్షణాలు ఒమిక్రాన్‌ తరహాలోనే ఉన్నాయని ఆరోగ్య అధికారులు చెబుతున్నారు.

జేఎన్‌-1 వేరియంట్ లక్షణాలు
గొంతు నొప్పి
జ్వరం
ముక్కు కారడం
పొడి దగ్గు
తలనొప్పి
అలసట
రుచి లేదా వాసన కోల్పోవడం

తాజాగా కరోనా బారిన పడిన బాధితులలో కొందరు  తాము తీవ్రమైన అలసటను ఎదుర్కొంటున్నామని తెలిపారు. వర్షాకాలం(Rainy season) వచ్చే ముందు సంభవించే వ్యాధులు ఇప్పటికే దేశంలోని కొన్ని ప్రాంతాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఫ్లూ తరహా లక్షణాలను ఎదుర్కొంటున్న వారు జనసమూహాలకు దూరంగా ఉండాలని, వైద్య పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: బ్రిటిష్‌ కశ్మీరీ ప్రొఫెసర్‌ ఓసీఐ రద్దు.. కారణమిదే..
 

Videos

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

సాక్ష్యాలతో వస్తాం .. సిద్ధంగా ఉండు..! లోకేష్ కు YSRCP ఎమ్మెల్సీ సవాల్

కూటమిలో లోకల్ వార్.. బాబుకు జనసేన, బీజేపీ హెచ్చరిక

ఎక్కడ దాక్కున్నావ్ లోకేష్.. కొండారెడ్డి బురుజుకు ఇప్పుడురా..

సరదాకు ఉద్యమాలు చేయడం లేదు.. ఇంకెంతకాలం సాగదీస్తావ్ చంద్రబాబు

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ చేయడం కూటమి పిరికి చర్య..

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు