Breaking News

సీసీటీవీ సాక్షిగా భార్యాభర్తల గొడవ, ఆ మర్నాడే..

Published on Mon, 06/30/2025 - 10:10

జైపూర్: రాజస్థాన్‌లోని జైపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఒక దంపతుల జంట వారి ఇంట్లో  అచేతనంగా కనిపించింది. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు ఈ  జంట ఆత్మహత్య  చేసుకున్నారని భావిస్తున్నారు. అలాగే అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ప్రారంభించారు.

జైపూర్‌లోని ఒక బ్యాంకులో సేల్స్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న ధర్మేంద్ర సమయం గడుస్తున్నా బ్యాంకుకు రాకపోవడంతో,  సిబ్బంది అతనికి కాల్‌ చేశారు. దానికి కూడా సమాధానం రాకపోవడంతో ధర్మేంద్ర స్నేహితుడు అతని ఇంటికి వెళ్లాడు. అతను ఇంటి తలుపు తెరవగానే ధర్మేంద్రతో పాటు అతని భార్య విగతజీవులుగా కనిపించారు.

కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు వారి ఫ్లాట్ పార్కింగ్ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా, దానిలో ధర్మేంద్ర, సుమన్‌లు ఏదో విషయమై తీవ్ర స్థాయిలో అరుచుకుంటూ, వాదించుకోవడం కనిపించింది. ఈ ఫుటేజ్ దంపతులు మృతిచెందడానికి ముందురోజుదిగా పోలీసులు గుర్తించారు. అలాగే ఆ వీడియోలో సుమన్ తన భర్త కారు తీయడాన్ని అడ్డుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఆ తరువాత వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం వారు తమ ఇంటిలోనికి వెళ్లిపోయారు.

అదే రోజు సాయంత్రం నాటి మరో వీడియోలో వారు  అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించడం కనిపించింది. ఆ సమయంలో సుమన్ ఒక బ్యాగ్ తీసుకెళుతున్నది. ఇద్దరూ సజీవంగా కనిపించిన చివరి ఫుటేజ్‌ ఇదే. కాగా ఈ జంట ఇటీవలే ఫ్లాట్‌ను కొనుగోలు చేశారని, వారి ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని స్థానికులు తెలిపారు. వారికి  ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు ప్రస్తుతం భరత్‌పూర్‌లోని  తాత ఇంటిలో ఉన్నారు. కాగా సుమన్ తండ్రి అజయ్ సింగ్ పోలీసులతో మాట్లాడుతూ తన కుమార్తె శరీరంపై గాయాల గుర్తులు ఉన్నాయని, ఇది హత్యనని ఆరోపించారు.

ఇది కూడా చదవండి: Kolkata: బాధితురాలిని బలవంతంగా.. సీసీటీవీలో షాకింగ్‌ దృశ్యాలు

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)