Breaking News

తీవ్ర ప్రమాదంలో రాజ్యాంగం

Published on Fri, 12/27/2024 - 05:33

బెళగావి: మన రాజ్యాంగం మునుపెన్నడూ ఎదుర్కోనంతటి తీవ్ర ముప్పును ఎదుర్కొంటోందని కాంగ్రెస్‌ ఆందోళన వ్యక్తం చేసింది. పార్లమెంట్‌లో రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ను అవమానించడం హోం మంత్రి అమి త్‌ షా రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేసింది. దేశ ప్రజలకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమి టీ(సీడబ్ల్యూసీ) సమావేశం డిమాండ్‌ చేసింది. అమిత్‌ షా చర్య రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌–బీజేపీలు దశాబ్దాలుగా సాగిస్తున్న కుట్రలో భాగమేనని మండిపడింది. సీడబ్ల్యూసీ సమావేశం గురువారం కర్ణాటకలోని బెళగావిలో జరిగింది. 

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే మాట్లాడారు. పెరుగుతున్న ధరలు, అవినీతి, రాజ్యాంగంపై దాడి వంటి వాటిపై పాదయాత్రలు వంటి రాజకీయ ప్రచార కార్యక్రమాలను 13 నెలలపాటు చేపడతామన్నారు. జవాబుదారీతనం, సమర్థత ప్రాతిపదికగా పారీ్టలో భారీగా సంస్థాగత ప్రక్షాళన చేపడతామని చెప్పారు. అసత్యాలను వ్యాప్తి చేసే వారిపై పోరాటానికి పారీ్టకి 2025 సంస్థాగత సాధికారిత వత్సరంగా ఉంటుందని ఖర్గే తెలిపారు. ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేందుకు ప్రాంతీయ, నూతన నాయకత్వానికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ను అమలు చేసి ఏఐసీసీ నుంచి బూత్‌ స్థాయి వరకు ఎన్నికలు జరుపుతామన్నారు. 

రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌కు గౌరవం కల్పించేందుకు పార్టీ పోరాడుతుందన్నారు. ఖర్గేతోపాటు పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ప్రధాన కార్యదర్శులు జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్న ‘నవ సత్యాగ్రహ బైఠక్‌’ఈ మేరకు రెండు రాజకీయ తీర్మానాలను చేసింది. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’వంటి విధానాలను తీసుకురావడం ద్వారా సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసేందుకు ప్రభుత్వం ప్రయతి్నస్తోంది. న్యాయవ్యవస్థ, ఎన్నిక కమిషన్, మీడియాలను తీవ్ర ఒత్తిడులకు గురిచేసి అనుకూలంగా మార్చుకుంటోంది. ఇటీవలి పార్లమెంట్‌ సమావేశాలకు పాలకపక్షం తీవ్ర అవరోధాలు కలిగించింది.

 పోలింగ్‌ పత్రాలను ప్రజలకు అందుబాటులో లేకుండా చేసేలా ఎన్నికల నిబంధనావళిని మార్చుకుంటోంది’అంటూ సీడబ్ల్యూసీ మండిపడింది. హరియాణా, మహారాష్ట్రలలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల సమగ్రత దెబ్బతిందని ఆరోపించింది. మైనారిటీ వర్గం లక్ష్యంగా విద్వేషం, హింసను ప్రభుత్వమే ప్రేరేపించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. కుల గణనను సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని కేంద్రాన్ని కోరింది. ఆర్థిక పురోగతి మందగించిందని, అత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని తెలిపింది. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కలి్పంచాలని, ఉపాధి హామీ పథకానికి అవసరమైన నిధులివ్వాలని 
కోరింది. 

మహాత్ముని ఆశయాలకు భంగం: సోనియా గాంధీ 
మహాత్మా గాం«దీయే స్ఫూర్తిగా తమ పార్టీ ఇకపైనా కొనసాగుతుందని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చీఫ్‌ సోనియా గాంధీ స్పష్టం చేశారు. మహాత్ముని ఆశయాలు, సిద్ధాంతాలు, సంస్థలకు కేంద్రంలో అధికారంలో ఉన్న వారి నుంచి ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీజీ హత్యకు దారి తీసిన విషపూరిత వాతావరణాన్ని సృష్టించిన శక్తులైన మోదీ ప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్‌లతో పోరాడాలంటూ ఆమె కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం సోనియా ఈ మేరకు సీడబ్ల్యూసీకి పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య