Breaking News

హర్యానాలో 25 లక్షల ఓట్లు చోరీ

Published on Wed, 11/05/2025 - 12:44

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఓటు చోరీ ఆరోపణలతో పాటు ‘హెచ్’ ఫైల్స్‌ను బహిర్గతం చేశారు. హర్యానాలో 25,41,144 లక్షల ఓటు చోరీ కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ‘మా దగ్గర ‘హెచ్‌’ ఫైల్స్ ఉన్నాయి. రాష్ట్రంలో ఓటు చోరీ ఎలా జరిగిందో దానిలో ఉంది. ఇది రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో జరుగుతోందని అనుమానిస్తున్నాం. హర్యానాలోని మా అభ్యర్థులు.. ఏదో తప్పు జరిగిందంటూ ఫిర్యాదులు విరివిగా చేశారని రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు.

హర్యానా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపించిన రాహుల్‌ .. కాంగ్రెస్ విజయాన్ని బీజేపీ విజయంగా మార్చేందుకు ఒక ప్రణాళికను అమలు చేశారని ఆరోపించారు. హర్యానాలో 25 లక్షల ఓట్లు చోరీ అయ్యాయని, ఇందులో 5.21 లక్షల నకిలీ ఓటర్లు, 93,174 చెల్లని ఓటర్లు, 19.26 లక్షల బల్క్ ఓటర్లు ఉన్నారని రాహుల్‌ పేర్కొన్నారు. తాను చెబుతున్న దానికి 100 శాతం రుజువు ఉందని, వారు కాంగ్రెస్ విజయాన్ని ఓటమిగా మార్చడానికి వ్యవస్థాగత తారుమారుకు పాల్పడ్డారని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

హర్యానాలో రెండు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 25 లక్షల మంది నకిలీ ఓటర్లు అని విలేకరుల సమావేశంలో రాహుల్‌ తెలిపారు. తన బృందం 5.21 లక్షల నకిలీ ఓటరు నమోదులను బయటపెట్టిందని, హర్యానాలో ప్రతి ఎనిమిది మంది ఓటర్లలో ఒకరు నకిలీవారున్నారు. ఓటరు జాబితాలో వ్యత్యాసాలను చూపించే స్లయిడ్‌లను రాహుల్‌ ప్రదర్శించారు. ఓటు చోరీ కోసం బ్రెజిలియన్ మోడల్ వాడారని ఆరోపించారు. ప్రజాస్వామ్య ప్రక్రియను అణిచివేసేందుకు బీజేపీ ప్రణాళికాబద్ధమైన ఆపరేషన్‌ను నిర్వహిస్తోందని రాహుల్‌ ఆరోపించారు.

అన్ని ఎగ్జిట్ పోల్స్ హర్యానాలో కాంగ్రెస్ విజయాన్ని సూచించాయ‌ని గుర్తుచేశారు. హర్యానా చరిత్రలో తొలిసారిగా, పోస్టల్ బ్యాలెట్లు వాస్తవ ఓట్లతో సరిపోలలేదని, ఇది ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదని, కాంగ్రెస్ అఖండ విజయాన్ని ఓటమిగా మార్చడానికి ఒక ప్రణాళికను అమలు చేశారని రాహుల్‌ ఆరోపించారు. అయితే ఎన్నికల కమిషన్ వర్గాలు రాహుల్ గాంధీ వాదనలను తోసిపుచ్చాయి. రాష్ట్ర ఓటర్ల జాబితాకు వ్యతిరేకంగా “సున్నా అప్పీళ్లు” దాఖలు అయ్యాయన్నారు.

ఇది కూడా చదవండి: నెహ్రూను గుర్తు చేసుకున్న మమ్దానీ

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)