Breaking News

‘డిప్యూటీ స్పీకర్‌ పదవి’పై ప్రధానికి మల్లికార్జున ఖర్గే లేఖ

Published on Wed, 06/11/2025 - 05:11

సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ అంశాన్ని కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ లేవనెత్తింది. డిప్యూటీ స్పీకర్‌ పదవికి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ పదవిని ఖాళీగా ఉంచడం భారత ప్రజాస్వామ్య రాజకీయాలకు మంచి సంకేతం కాదని, ఇది రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమేనని కాంగ్రెస్‌ అధ్యక్షుడు అన్నారు. జూలై 21 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు ఖర్గే ఈ డిమాండ్‌ చేశారు.

‘లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్‌ పదవి ఖాళీకి సంబంధించిన ఆందోళనకరమైన విషయంపై మీ దృష్టిని ఆకర్షించడానికే నేను ఈ లేఖ రాస్తున్నాను’అంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ప్రధానికి రాసిన తన లేఖలో పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 93 లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ ఇద్దరినీ ఎన్నుకోవడానికి వీలు కల్పిస్తుంది. రాజ్యాంగపరంగా, డిప్యూటీ స్పీకర్‌ లోక్‌సభ స్పీకర్‌ తర్వాత రెండవ అత్యున్నత ప్రిసైడింగ్‌ అధికారి. సంప్రదాయంగా లోక్‌సభ రెండవ లేదా మూడవ సమావేశంలో డిప్యూటీ స్పీకర్‌ ఎన్నికవుతారని... లోక్‌సభలో కార్యనిర్వహణ, విధాన నియమాలలోని 8(1) నిబంధన ప్రకారం డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక తేదీని స్పీకర్‌ నిర్ణయిస్తారు అనేది ఒకే తేడా అని ఖర్గే తెలిపారు.

మొదటి లోక్‌సభ నుంచి పదహారవ లోక్‌సభ వరకు ప్రతి సభలో ఒక డిప్యూటీ స్పీకర్‌ ఉన్నారని ఖర్గే అన్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ సభ్యుల నుంచి డిప్యూటీ స్పీకర్‌ను నియమించడం ఒక ఆనవాయితీ అని... స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా, ఈ పదవి వరుసగా రెండు లోక్‌సభ పర్యాయాలు ఖాళీగా ఉందని ఖర్గే విమర్శించారు. పదిహేడవ లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక కాలేదని.. ఇదే విధా నం పద్దెనిమిదవ లోక్‌సభలో కూడా కొనసాగుతోందన్నారు. ఇది భారతదేశ ప్రజాస్వామ్య రాజకీయాలకు మంచి సంకేతం కాదని.. ఇది రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమే అని ఖర్గే ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. అందువల్ల సభ సంప్రదాయాలను, పార్లమెంటు ప్రజాస్వామ్య విలువలను దృష్టిలో ఉంచుకుని, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక ప్రక్రియను ఇక ఆలస్యం చేయకుండా ప్రారంభించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోరారు. 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు