Breaking News

రాజ్యాంగంపై నిరంతరం దాడి

Published on Thu, 11/27/2025 - 05:55

న్యూఢిల్లీ: భారత రాజ్యాంగంపై బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ నిరంతరం దాడి చేస్తూ దాని ఔన్నత్యాన్ని దెబ్బతీయడానికి కుట్రలు సాగిస్తున్నాయని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. రాజ్యాంగ విలువలు, సూత్రాలను ఒక పద్ధతి ప్రకారం కాలరాస్తున్నాయని, సమాఖ్య స్ఫూర్తిని ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించారు. రాజ్యాంగం రూపకల్పనలో బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌లకు ఎలాంటి పాత్ర లేదని ఖర్గే బుధవారం ‘ఎక్స్‌’లో తేల్చిచెప్పారు. 

నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని, రాజ్యాంగాన్ని అవమానిస్తోందని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని అణచివేసే బాధ్యతను ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాలు ముందుకు తీసుకెళ్తున్నారని ఆక్షేపించారు. మరోవైపు అగ్రనేత రాహుల్‌ గాంధీ ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. రాజ్యాంగం అనేది పేదలకు ఒక రక్షణ కవచమని పేర్కొన్నారు. రాజ్యాంగంపై దాడిని సహించబోమంటూ ప్రతిజ్ఞ చేయాలని ప్రజలను కోరారు. 

ఈ దాడిని ఎదుర్కోవడానికి తాను ఎల్లప్పుడూ ముందంజలో ఉంటానని స్పష్టంచేశారు. రాజ్యాంగం అంటే ఒక పుస్తకం కాదని, అది ప్రజలకు ఇచ్చిన పవిత్రమైన హామీ అని ఉద్ఘాటించారు. ప్రజలందరికీ ఎలాంటి వివక్ష లేకుండా సమానత్వం, గౌరవం, న్యాయం చేకూర్చడమే రాజ్యాంగం ఇస్తున్న హామీ అని వెల్లడించారు. మరోవైపు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటకలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, సిద్ధరామయ్య పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కాపాడుకుంటామని తేల్చిచెప్పారు.  
 

Videos

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు