మేం ఎన్నికల్లో పోటీ చేయం

Published on Wed, 06/17/2026 - 05:23

నాగ్‌పూర్‌: ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తమకు లేదని కాక్రోచ్‌ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో మంగళవారం నాగ్‌పూర్‌లో తలపెట్టిన నిరసనలో పాల్గొనేందుకు వచ్చిన దీప్కే మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో అభ్యర్థులను పోటీకి నిలబెడతారా అని ప్రశ్నించగా, ‘మేం ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలి. నా ఉద్దేశం ప్రతి ఒక్కరూ తమ హక్కుల కోసం ఎన్నికల్లో పోటీకి దిగడం సబబా?’అని పేర్కొన్నారు. 

నీట్‌ పేపర్‌ లీకేజీతో తీవ్ర ఆందోళనకు గురైన విద్యార్థులను ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. నీట్‌ పేపర్‌ లీకేజీ కారణంగా బలవన్మరణాలకు పాల్పడిన ఐదారుగురు విద్యార్థుల తల్లిదండ్రులకు ముందుగా ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని దీప్కే డిమాండ్‌ చేశారు. ‘మోదీజీ ప్రపంచంలోనే ఏం జరిగినా ట్వీట్లు చేస్తుంటారు. కానీ, ఇక్కడ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మాత్రం పట్టించుకోరు. కనీసం సంతాప సందేశం కూడా ట్వీట్‌ చేయరు. మన్‌కీ బాత్, పరీక్షా పే చర్చ ఇంకా ఎన్ని రోజులు..? కనీసం విద్యార్థుల మన్‌కీబాత్‌ వినిపించుకోండి’అంటూ దీప్కే తీవ్రంగా స్పందించారు. సోమవారం జైపూర్‌లో నిరసన సందర్భంగా తనపై జరిగిన దాడిపై దీప్కే స్పందిస్తూ.. ‘ఈ ఘటన వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ నేతల హస్తముందని’ దిప్కే పేర్కొన్నారు.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)