Breaking News

Mahakumbh: ప్రధాని బాటలో సీఎం.. పారిశుద్ధ్య కార్యికుల కాళ్లు కడిగి..

Published on Mon, 02/24/2025 - 11:51

ప్రయాగ్‌రాజ్‌: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా(Kumbh Mela)కు భక్తులు విపరీతంగా తరలివస్తున్నారు. జనవరి 13 నుంచి ఇప్పటివరకూ అంటే ఫిబ్రవరి 23 వరకూ మొత్తం 62 కోట్లకుపైగా జనం త్రివేణీ సంగమంలో పవిత్ర స​్నానాలు ఆచరించారు. ఇన్ని కోట్ల మంది భక్తులు ఇక్కడికి వస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రజల మౌలిక సదుపాయాలు, పరిశుభ్రతపై దృష్టి సారించారు. ఈ నేపధ్యంలోనే గత నెలన్నర రోజులుగా కుంభమేళా ప్రాంతంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్న సిబ్బందిని సీఎం సత్కరించనున్నారు.

కుంభమేళా ప్రాంతంలో పరిశుభ్రతా కార్యక్రమాలు(Sanitation) నిర్వహిస్తున్న సిబ్బంది సేవలను సీఎం కొనియాడారు. అలానే వారిని సన్మానించనున్నామని తెలిపారు.  ఆయన త్రివేణీ సంగమ ప్రాంతంలో తిరుగాడుతూ స్వయంగా అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. మహాకుంభమేళా ముగిసేందుకు ఇక కొద్ది రోజులు మాత్రమే మిగిలివుంది. మహాశిరాత్రి రోజున భక్తులు కుంభమేళాలో చివరి పుణ్యస్నానాలు చేయనున్నారు. గడచిన నాలుగు రోజులుగా కుంభమేళా ప్రాంతానికి వస్తున్న సీఎం అక్కడి సాధువులను, అధికారులను కలుసుకుంటున్నారు.  

కుంభమేళాలో చివరి పుణ్యస్నానాలు పూర్తియిన మర్నాడు అంటే ఫిబ్రవరి 27న సీఎం యోగి మరోమారు ‍ప్రయాగ్‌రాజ్‌ రానున్నారు. ఆరోజున ఆయన కుంభమేళాకు తరలివచ్చిన భక్తులకు సేవలు అందించిన వారిని సన్మానించనున్నారు. ముఖ్యంగా పారిశుధ్య కార్మికులను, పడవలు నడిపినవారిని సీఎం సత్కరించనున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు(sanitation workers) సమాజంలో తగిన గౌరవ కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. గతంలో ప్రధాని మోదీ వారణాసిలో పారిశుధ్య కార్మికుల పాదాలు కడిగి, సమాజంలో వారి స్థానాన్ని గుర్తుచేశారు.

ఇది కూడా చదవండి: విద్యార్థులకు పరీక్షలున్నాయని.. ప్రధాని మోదీ ఏం చేశారంటే..

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)