Breaking News

కావేరీ నీటి వాటా: కర్ణాటక నిర్ణయాన్ని ఖండించిన సీఎం స్టాలిన్‌

Published on Tue, 07/16/2024 - 16:39

చెన్నై: తమిళనాడుకు రావాల్సిన కావేరీ నీటి వాటా విడుదలపై కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సీఎం స్టాలిన్‌ ఖండించారు. ఆయన మంగళవారం కావేరీ జలాల వివాదంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం సీఎం స్టాలిన్‌ మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు  ఆదేశాల మేరకు కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు రావాల్సిన కావేరీ నీటిని విడుదల చేయకపోవటాన్ని తప్పుపట్టారు.

‘కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు కావేరీ నీటిని విడుదల చేయకపోవటాన్ని అఖిలపక్షం తీవ్రంగా ఖండించింది. సుప్రీం కోర్టు  ఆదేశాల మేరకు కర్ణాటక ప్రభుత్వం తమిళనాడుకు రావాల్సిన కావేరీ నీటి వాటాను విడుదల చేయాలని కావేరీ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీని కోరుతున్నాం’ అని తెలిపారు.

ఇక.. కర్ణాటక ప్రభుత్వం కేవలం 8వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే తమిళనాడుకు విడుదల చేస్తామని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆదివారం నుంచి మళ్లీ కావేరీ జలాల వివాదం తెరపైకి వచ్చింది. అయితే తమిళనాడుకు వెయ్యి క్యూబిక్‌ మీటర్ల నీటిని విడుదల చేయాల్సి ఉంది.

నిన్న(సోమవారం)  కర్ణాటక  ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం అనంతరం తమిళనాడు కావేరీ నీటి పంపిణీపై నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు. ‘మేము ప్రతిరోజు  ఒక టీఎంసీ కావేరీ నీటిని తమిళనాడుకు విడుదల చేయలేం. కేవలం 8 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేయగలమని కోర్టుకు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని అన్నారు.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)